కొడుకు చనిపోయాక.. ఆ అత్త కోడలిని ఏం చేసిందో తెలుసా?

praveen
అత్త కోడలు.. ఈ రెండు పేర్లను కలిపి విన్నారంటే చాలు అందరూ భయపడిపోతుంటారు. ఎందుకంటే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ఆ రేంజ్ లో ఉంటాయి. ఇదంతా సినిమాల ప్రభావమా లేకపోతే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ప్రభావమో తెలియదు.. కానీ అత్తా కోడలు అని పేరు చెప్పగానే వారి మధ్య ఉండే మనస్పర్ధలు గొడవలు ఎక్కువగా అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. సినిమాల్లో కూడా ఎక్కువగా ఇలాంటివే చూపిస్తూ ఉంటారు. ఇక అత్తా కోడలు ఒక దగ్గర చేరారు అంటే చాలు ఇల్లు మొత్తం దద్దరిల్లిపోతోంది. వారిద్దరి మధ్య ఆ రేంజ్ లో గొడవ జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి ఏమో కానీ అందరూ అత్తా కోడలు అలాగే ఉండరు కదా..


 అతను తల్లిగా చూసుకునే కోడలు.. కోడలిని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకునే అత్తలు కూడా అక్కడక్కడ తారసపడుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి అత్తా కోడలు గురించి అనే చెప్పాలి.  కోడలిని కన్న కూతురు గా భావించి ఏకంగా ఆ అత్త ఎవరూ చేయని పని చేసింది.  ఏకంగా కన్యా దానం చేసిన  ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. శిఖర్ జిల్లా పతే పూర్ షాకావత్ ప్రాంతానికి చెందిన కమలాదేవి చిన్న కొడుకు శోభన్ కు సునీత దేవి అనే యువతితో 2016 లో వివాహం జరిగింది. ఎలాంటి కట్నకానుకలు తీసుకోకుండానే కోడలు ఇంటికి తెచ్చుకుంది.


 కానీ అంతలో అనుకోని ఘటన కొడుకు బ్రెయిన్ స్ట్రోక్  తో చనిపోయాడు. అయితే అప్పటి నుంచి కోడలు సునిత దేవి కి తల్లిలా మారిపోయింది అత్త. తన కూతురులా చూసుకోవడం మొదలు పెట్టింది  ఈ క్రమంలోనే పెళ్లికి ముందు డిగ్రీ పూర్తిచేసిన కోడలు సునీతను ఉన్నత చదువులు చదువుకునేందుకు  ప్రోత్సహించింది.  ఆమె కాళ్ళ పై ఆమె బ్రతికే విధంగా ప్రయోజకుల్ని చేసింది ఆ అత్త. ఇటీవలే ఉన్నత చదువులు చదివిన కోడలు ఉద్యోగం కూడా సంపాదించుకుంది. అయితే ఇక కొడుకు పోయిన తర్వాత ఒంటరిగా ఉండిపోయిన కోడలికి పెళ్లి చేయాలని ఒక మంచి ఆలోచన అత్త మనసులో తట్టింది.  ఏకంగా తల్లిలాగా కోడలిని కన్యాదానం చేసి మరో యువకుడు ఇచ్చి పెళ్లి చేసింది. ప్రస్తుతం సునీత దేవి పెళ్లి చేసుకున్న యువకుడు భూపాల్ లో ఆడిటర్ గా పని చేస్తున్నాడు  అతనికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. అంతేకాదు కూతుర్ని కాపురానికి పంపిస్తూ అత్త కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎంతగానో కలిచివేసింది. ఈ ఆదర్శ అత్తాకోడళ్ల స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: