ఆంధ్రప్రదేశ్ జిల్లాలపై తెలంగాణా నుంచి డిమాండ్..

Purushottham Vinay
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని జిల్లాల విషయంలో తన నిర్ణయం మార్చుకోకపోతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని వైసీపీ వాళ్లు నేరుగా జగన్ మోహన్ రెడ్డికే హెచ్చరికలు పంపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తున్నామని..ఉగాది పండుగ నుంచి ఈ కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుందని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.అయితే ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు జిల్లాల్లో పార్టీల నాయకులు ప్రజలు మేథావుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత అనేది వస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని జిల్లాల్లో చారిత్రక నేపథ్యం పోతోందని ఇంకా అలాగే మరి కొన్ని చోట్ల అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను వదిలేసి ఇంకా కొత్త ప్రాంతాలతో ఎందుకు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి అభ్యంతరాలు అనేవి కూడా రావడం విశేషం.
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినా వి హనుమంత రావు ఏపీ జిల్లాల విషయంలో కొత్త డిమాండ్ తెరమీదకు తేవడం జరిగింది. కర్నూలు జిల్లాకు అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న ఆలోచన రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమన్నారు.ఇక ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య కూడా చాలా బాగా పనిచేశారని.. ఆయన సేవలకు గుర్తుగా అయినా కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వీహెచ్ కోరడం జరిగింది.ఇక అలాగే కడపకు వైఎస్సార్ పేరు విజయవాడకు ఎన్టీఆర్ మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న ఆలోచన రాకపోవడం చాలా సిగ్గుచేటు అని ఆయన విమర్శించడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి దీనిపై వెంటనే పునరాలోచన చేయాలని... ఇంకా అలాగే స్థానికంగా ఉన్న నేతలు సైతం ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి పై ఒత్తిడి అనేది తీసుకు రావాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: