నా పోరాటం కేవలం బీజేపీపైనే.. ఉత్పల్ పారికర్ కీలక వ్యాఖ్యలు..

frame నా పోరాటం కేవలం బీజేపీపైనే.. ఉత్పల్ పారికర్ కీలక వ్యాఖ్యలు..

Veldandi Saikiran
గోవా అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకుడు దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల పారీకర్ తన తండ్రి నియోజకవర్గం అయినటువంటి పనాజీ నుంచి గురువారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉత్పల్ పారికర్.. కు పనాజి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన భారతీయ జనతా పార్టీ కి గత వారం రాజీనామా చేశారు. ఈ తరుణంలోనే తాను భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకంగా పనాజీలో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల పారికర్. నామినేషన్ వేసిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచినా  తాను తిరిగి భారతీయ జనతా పార్టీ లో చేరే సమస్య లేదని కుండ బద్దలు కొట్టారు. 


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన పోరాటం ఆమ్ ఆద్మీ, తృణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీపై కాదని... తన పోరాటం కేవలం భారతీయ జనతా పార్టీపై నేనని వెల్లడించారు ఉత్పల్ పారికర్. భారతీయ జనతా పార్టీ తనకు రెండు లేదా మూడు సీట్లు ఇచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ చెబుతున్నారని గుర్తు చేశారు ఉత్పల్ పరికర్. అయితే అసలు నిజం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ తనకు పనాజీ నుంచి పోటీ చేసేందుకు ఎన్నడూ కూడా టికెట్ ఇవ్వలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. తాను ఎన్నికల్లో గెలిచినా... తిరిగి భారతీయ జనతా పార్టీలు అసలు చేరబోనని చెప్పారు. పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పనాజీ ప్రజలకు తాను అసలైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని ప్రకటన చేశారు. ఉత్పల పారీకర్ తన తండ్రి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన అటువంటి పనాజీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ పనాజీలో కాంగ్రెస్ మాజీ నేత అక్కడ ఎమ్మెల్యే కు టికెట్ ఇచ్చింది బిజెపి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు పారికర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: