గుడ్ న్యూస్.. దళిత బంధు ఇక రాష్ట్రమంతా?

praveen
కెసిఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. కానీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పథకం మాత్రం దళిత బంధు అని చెప్పాలి. సరిగ్గా హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్. ఈ క్రమంలోనే కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇక దీని ఊసే ప్రభుత్వం ఎత్తదు అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగా కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని హుజరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.

 అయితే కేవలం హుజురాబాద్ లో మాత్రమే  మీకు దళితులు కనిపిస్తున్నారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు కనిపించడం లేదా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇకపోతే ఇటీవలే దళిత బంధు పథకం పై కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దళిత బందు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపింది.  రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఇక ప్రతిష్ఠాత్మకమైన దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

 ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేల సలహాతో 100 మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండా 10 లక్షలు ఆర్థిక సహాయం చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ను ఎంపిక చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇటీవలే కరీంనగర్ లో కూడా యూనిట్ల వారీగా లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు మంత్రి గంగుల కమలాకర్. కాగా దళిత బంధు పథకం లో భాగంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి కూడా పది లక్షల రూపాయలు అందజేస్తామని కెసిఆర్ ప్రభుత్వం సరికొత్త పథకం ప్రవేశపెట్టింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: