ఇవిగో లెక్కలు: టీఆర్‌ఎస్‌ ఆదాయం, అప్పులు ఎన్నికోట్లు..?

Chakravarthi Kalyan
టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు మంచి స్వింగ్‌లో ఉంది. దాదాపు 8 ఏళ్లుగా అధికారంలో ఉంది. అంతే కాదు.. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తోంది. పెద్దగా ప్రతిపక్షాల నుంచి కూడా ప్రతిఘటన లేదు. మరోసారి తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే.. పార్టీ పరంగా టీఆర్ఎస్‌ ఆదాయం ఎంత.. ఈ పార్టీకి అప్పులు ఎన్ని.. ఆదాయం, వ్యయం ఎలా చేస్తోంది.. ఈ అంశాలు తెలుసుకుందాం.. ప్రతి రాజకీయ పార్టీ ఈ అంశాలపై ఎన్నికల సంఘానికి ఏటా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.

తాజాగా టీఆర్ఎస్‌ కూడా ఈ నివేదిక అందించింది. తెలంగాణ రాష్ట్ర సమితి 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.37.65 కోట్ల ఆదాయం చూసింది. టీఆర్ఎస్‌ ఈసీకి సమర్పించిన ఆడిట్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. విచిత్రం ఏంటంటే.. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఏకంగా రూ.136 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టీఆర్ఎస్‌ ఆదాయం బాగా తగ్గిపోయిందన్నమాట.. లెక్కల్లో చూస్తే గతేడాదితో పోలిస్తే టీఆర్‌ఎస్‌ ఆదాయం 71% తక్కువగా నమోదైంది.

అసలు రాజకీయ పార్టీలకు ఆదాయం ఎలా వస్తుంది.. అంటారా.. ఆ పార్టీ చందాలు, సభ్యత్వ రుసుములు, సబ్‌స్క్రిప్షన్లు.. ఇలాంటి వాటి ద్వారా వచ్చేదే ఆదాయం.. అలా 2020-21 ఆర్థిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌కు ఫీజులు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా రూ.17.26 కోట్లు వచ్చాయట. ఆ తర్వాత  స్వచ్ఛంద విరాళాలు, చందాల ద్వారా రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చిందట. ఇవి కాకుండా ఇంకా  ఇతర ఆదాయం రూ.16.21 కోట్లు వరకూ వచ్చిందట.

ఖర్చు విషయానికి వస్తే.. ఈ ఆర్థిక ఏడాదిలో టీఆర్ఎస్‌ రూ.22.34 కోట్లు ఖర్చు చేసిందట. ఆదాయం, ఖర్చులు లెక్కలు చూసిన తర్వాత ఫైనల్‌గా ఈ ఏడాదికి రూ.15.30 కోట్లు మిగిలాయట. ఈ మిగిలిన మొత్తంతో కలుపుకుని టీఆర్‌ఎస్‌ ఖాతాలోని మొత్తం నిల్వలు రూ.307 కోట్లకు చేరిందట.
ఇదీ టీఆర్ఎస్‌ పార్టీ డబ్బు లెక్కల వివరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: