షాకింగ్‌: ఘోరంగా దిగజారిన కేసీఆర్‌, జగన్‌ ర్యాంకులు..?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే.. ఎందుకంటే.. దేశంలోని బెస్ట్ సీఎంల జాబితాలో ఈ ఇద్దరి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి.. ఇదేదో అల్లాటప్ప సంస్థ చేసిన సర్వే కాదు.. కాస్త దేశంలోనే పేరున్న ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే.. గతంలో ఇదే సంస్థ  సర్వే నిర్వహించిన సర్వేల్లో కేసీఆర్‌ ఓసారి.. సీఎం జగన్ ఓసారి టాప్‌ ర్యాంకు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయా పార్టీలు ఆ విషయాన్ని ఘనంగా చెప్పుకున్నాయి కూడా.

ఇండియా టుడే సంస్థ ఎప్పటికప్పుడు మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఈ సర్వేల్లో దేశంలో రాజకీయం ఎలా ఉంది.. ఏ నాయకుడి పరిస్థితి ఏంటి.. ఏ నాయకుడిపై అక్కడి స్థానిక జనం ఏమనుకుంటున్నారు.. దేశంలో టాప్ లీడర్ ఎవరు.. ఎవరి ప్రతిష్ట ఎలా ఉంది.. అనే అంశాలపై తరచూ సర్వే చేస్తుంటుంది. తాజాగా ఇండియా టుడే సంస్థ ఈ జనవరిలో నిర్వహించిన సర్వేలో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరి ర్యాంకులూ దిగజారాయి.

ఈ ఇద్దరు కనీసం టాప్ టెన్‌లో కూడా లేరు. ఈసారి అగ్రస్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ ఉన్నారు. ఇక రెండో స్థానంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. దేశంలోనే మూడో బెస్ట్ సీఎంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. నవీన్‌ పట్నాయక్ అందరి కంటే ఎక్కువగా 71 శాతం ప్రజానుకూల అభిప్రాయంతో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఇక మమతా బెనర్జీకి 69.9% శాతం అనుకూల ఓట్లు వచ్చాయి. స్టాలిన్‌కు  67.5% ఓట్లు వచ్చాయి.

ఇలా మొత్తం టాప్‌ టెన్‌ లీడర్లో భూపేష్‌, అశోక్‌ గెహ్లాట్‌ ఉన్నారు. పదో స్థానంలో గెహ్లాట్‌ 44.9 శాతం ఓట్లతో ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ 43 శాతం కంటే తక్కువ ఓటింగ్‌ తెచ్చుకున్నారని సర్వే చెబుతోంది. అంత తక్కువ ఓటింగ్ రావడం వల్ల కేసీఆర్, జగన్ టాప్ టెన్‌ సీఎం ల జాబితాలో కనీసం స్థానం సంపాదించుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: