శ్రీకాకుళం కాల్పుల కేసులో ట్విస్ట్ అదుర్స్ ! ఎందుకంటే?
శ్రీకాకుళం నగరంలో పెను సంచలనం రేపిన కాల్పుల కేసుకు సంబంధించి మరో ట్విస్టు వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం అనుసరించి రాస్తున్న కథనం ఇది.శ్రీకాకుళం నగరం, మధురా నగర్ కాలనీలో మంగళవారం రాత్రి రామచంద్రాపురం సర్పంచ్ గొలివి వెంకట రమణపై జరిగిన కాల్పుల ఘటనలో నిందితురాలు కింజరాపు షాలినీ కొన్ని విషయాలను వెల్లడించారు.పోలీసు ఇంట్రాగేషన్ తరువాత చాలా వివరాలు వెలుగులోకివచ్చాయి.ఆర్థిక లావాదేవీలు బెడిసి కొట్టడం వల్లే తానీ చర్యకు పూనుకున్నామని చెప్పారని సమాచారం.అదేవిధంగా వెపన్ ను మధ్య ప్రదేశ్ లో కొనుగోలు చేశామని షాలిని తమ్ముడు ఒప్పుకున్నాడు. మరో నిందితుడు కూడా వెంట వచ్చిన వాడే కానీ అతనికి క్రిమినల్ బ్యాగ్రౌండ్ లేదని భావిస్తున్నారు పోలీసులు.మొత్తానికి ఇది సుపారీ కాదని పోలీసులు తేల్చారు.అయితే ఇసుక అమ్మకాల్లో వాటాలు,ర్యాంపులకు సంబంధించి రావాల్సిన డబ్బులు, రియల్ ఎస్టేట్ గొడవల కారణంగానే హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని నిర్థారించారు పోలీసులు.
సర్పంచ్ కు సంబంధించి కూడా చాలా వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకూ, నిందితురాలు షాలినికి వివాదాలున్నాయని, ఆర్థిక సంబంధం అయిన లావాదేవీలు కోట్లలో నడుస్తున్నాయని పోలీసులు తేల్చారు. ముఖ్యంగా షాలిని ప్రవర్తనపై ఆదివారం పేట (శ్రీకాకుళం నగర శివారు) అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎవ్వరైనా ఎదిరిస్తే తన క్యాస్ట్ సర్టిఫికెట్ చూపించి మరి బెదిరిస్తారని కూడా తెలుస్తోంది.ఆమె తనని తాను యూపీ కి చెందిన దళితురాలినని చెప్పుకుంటారని కూడా స్థానికులు వెల్లడిస్తున్నారు.
ఇంట్రాగేషన్ లో పోలీసులకు చుక్కలు చిక్కులు
పోలీసు ఇంట్రాగేషన్ లో షాలిని కానీ బాధితుడు రమణ కానీ ఒకంతట నోరు విప్పలేదు అని తెలుస్తోంది. మహిళా ఏఎస్సై పదే పదే అడగ్గా అడగ్గా కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. మీరు కేసు కట్టండి నేను కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పి, ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించారని కూడా తెలుస్తోంది. పోలీసు వర్గాలు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇంకొన్ని వివరాలు అందాల్సి ఉందని, అయితే ఇదంతా బెదిరింపు కోసమే కానీ హత్య చేయాలన్న ఉద్దేశం తమది కాదని నిందితులు ఒప్పుకున్నారు. ఎస్పీ తోసహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు కేసును ఛేదించేందుకు మరింతగా ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఎస్పీ ప్రెస్మీట్ పెట్టనున్నారని కూడా తెలుస్తోంది.ఈ కేసులో క్లూస్ టీం,సీసీఎస్,ఒన్ టౌన్ పోలీసు చాకచక్యంగా వ్యవహరించి, కేసును 24 గంటల్లోనే ఛేదించి ఎస్పీ అభినందనలు అందుకున్నారు. ఈ మొత్తం వివాదంలో నిందితులు ఎక్కడా అధికార పార్టీ పేరు ఉపయోగించలేదు.అదేవిధంగా బాధితుడు గొలివి వెంకట రమణ కూడా పొంతన లేని సమాధానాలే ఇచ్చాడు కానీ అధికార పార్టీ పేరు ప్రస్తావించకుండానే తప్పుకున్నాడు.అయితే సర్పంచ్ నుంచి కూడా షాలినీకి కొన్ని మానసిక వేధింపులు ఉన్నాయని, అవి ఎక్కువ కావడంతోనే ఆమె తన తమ్ముడిని రంగంలోకి దింపి హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు తేల్చారు.