మంత్రి కన్వెన్షన్ హాల్ లో గోవా కల్చర్.. రచ్చ రచ్చ..

Satvika
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలలో మునిగి తెలుతున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో జోష్ కాస్త ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో కరోనా నిబందనలను పక్కన పెట్టి మరి సంబరాలలో మునిగి తేలుతూ ఉన్నారు. పోలీసులు కరోనా ఆంక్షలు విధించిన కూడా జనాలు వినకుండా విచ్చలు విడిగా తిరుగుతున్నారు. కొన్ని జిల్లాల్లొ కోడి పందాలు జొరుగా సాగుథున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని హోటల్స్, హాల్స్ లలో మద్యం ఎరులై పారుథుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలకు వాటికి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని తెలుస్తుంది.

కొన్ని కన్వెన్షన్ హాల్ లో గొవాను తలపిస్తున్నాయి. పబ్ కల్చర్ లో యువత మునిగి తెలుతున్నారు. అందులోనూ బాధ్యత కలిగిన మంత్రి పదవిలో వున్న వ్యక్తికి సంబంధించిన ఒక హాల్ లో ఇలా మద్యం సేవిస్తున్నారు.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి.. వివరాల్లొకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి.

అంత పబ్లిక్ గా ఇలా జరగడం పై రాజకీయ విష్లెషకులు పెదవి విరుస్తున్నారు.వైసీపీ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట, నంబర్ల ఆటలతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో ఏర్పాటు చేశారు. 10 వేల ప్రవేశ రుసుం చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి లభిస్తుంది. మొత్తానికి గోవాను తలిపించేలా లోపల బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినట్లు ఫోటోలను చూస్తె తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాళ్స్ ద్వారా నృత్య ప్రదర్శనలు సైతం ఇప్పిస్తున్నారు. తీన్ పత్తి, క్యాషియోన్, మూడు ముక్కలాటలు మరోవైపు జరుగుతున్నాయి. ప్రత్యేక లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు.. మొత్తానికి ఎటువంటి కట్టడి లేకుండా ఇలా ఎంజాయ్ చెస్తున్నారు. ఈ విషయం పై మంత్రి ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: