సంచ‌ల‌నం : అఖిలేష్‌కు ద‌ళితుల మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ట‌..?

N ANJANEYULU
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో ప్రాంతీయ పార్టీల‌తో స‌మాజ్‌వాది పార్టీ కూట‌మిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే ప‌లు పార్టీల నాయ‌కులు, ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. దీనికోసం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ తో కూడా సంప్ర‌దింపులు చేసారు. ఇందుకు భీమ్ ఆర్మీచీఫ్ చంద్ర‌శేఖ‌ర్ అడిగిన సీట్ల‌కు అఖిలేష్ నిరాక‌రించారు.
చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ 10 అసెంబ్లీ సీట్లు అడ‌గ‌గా.. అఖిలేష్ మాత్రం మూడు సీట్లు మాత్ర‌మే ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. దీనిపై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వ‌చ్చే నెల‌లో జ‌రుగ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ రాజ‌కీయ సంస్థ ఆజాద్ స‌మాజ్ పార్టీ.. స‌మాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌ద్దు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌కు ద‌ళితుల మ‌ద్ద‌తు అవ‌స‌రం లేదు అని ఆజాద్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసాడు.    
ముఖ్యంగా అఖిలేష్ మ‌మ్ముల్ని అవ‌మానించారు. బ‌హుజ‌న స‌మాజాన్ని అవ‌మాన‌ప‌రిచారని చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ చెప్పారు. సీట్ల పంప‌కాల‌పై అఖిలేష్‌తో భేటీ జ‌రిగిన మ‌రుస‌టి రోజునే  భీమ్ ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. అఖిలేష్ యాద‌వ్ కూట‌మీలో ద‌ళిత నాయ‌కులు మాత్రం వ‌ద్దు.. కానీ ద‌ళితుల ఓట్లు కావాలన్నారు. ద‌ళితులు ఆయ‌న‌కు ఓటు వేసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే మ‌నం మాట్లాడ‌లేని భ‌యం ప్రారంభం అయింద‌న్నారు. త‌మ స‌మ‌స్య‌ల గురించి అతనికి చెప్పండి.. మ‌మ్ముల్ని కొట్టినా.. తిట్టినా.. మా భూములు దోచుకున్నా.. మా మ‌హిళ‌ల‌పై అత్యాచారం చేసినా స్పందించ‌రు అని పేర్కొన్నారు.
యూపీలో ముఖ్యంగా పొత్తుల‌పై అఖిలేష్ త‌మ‌ను మోసం చేసార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండు రోజుల్లో త‌మ త‌దుప‌రి ప్ర‌ణాళిక‌పై నిర్ణ‌యం తీసుకుంటాం అని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. త్వ‌ర‌లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆజాద్‌ వెల్ల‌డించారు.  మ‌రొక‌వైపు ఆజాద్‌ స‌మాజ్‌వాదీ పార్టీతో పొత్తుపై అఖిలేష్ యాద‌వ్ స్పందించారు. భీమ్ ఆర్మీచీఫ్‌కు రెండు సీట్ల‌ను కేటాయిస్తాం అని చెప్పిన‌ట్టు వివ‌రించారు. అయితే అందుకు ఆజాద్ కూట‌మీలో కొన‌సాగేందుకు నిరాక‌రించారు అని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: