వైసీపీకి అక్క‌డ క్యాండెట్ క‌రువ‌య్యాడే... జ‌గ‌న్‌కు అవ‌మాన‌మే...?

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి తిరుగులేకుండా ఉంది. 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 22 లోక్‌స‌భ సీట్లు గెలుచుకుంది. జగన్ అధికారంలోకి వచ్చాక జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికతో పాటు... బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి ఎదురు లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి తిరుగు లేదని రాజకీయ పండితులు కూడా చెబుతున్నారు.
చంద్రబాబు పొత్తులు ఎత్తులు వేసినా కూడా జగన్ కు ఇబ్బంది ఉండదని కొందరు చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా వైసిపి ఇంత బలంగా ఉండి కూడా కొన్ని చోట్ల ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరంటే నమ్మాల్సిందే. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విజయవాడ పార్లమెంటు స్థానంలో వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు ఎవరు లేరు.
ఇది ఓ విధంగా జ‌గ‌న్‌కు అవ‌మానం లాంటిదే. ఇది కమ్మ సామాజిక వర్గానికి రిజర్వు అయిన‌ సీటు గానే చెప్పాలి. గత కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటున్నారు. ఇక వైసీపీ ఆవిర్భవించాక‌ జరిగిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కమ్మ వర్గానికి చెందిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ - పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వర ప్రసాద్ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎలాగూ సీటు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే జగన్ విజయవాడ ఎంపీగా ప్రయోగం చేసి... బీసీ వర్గానికి చెందిన నేతల‌ను రంగంలోకి దింపుతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: