గుడ్ న్యూస్: కరోనా థర్డ్ వేవే ఇక లాస్ట్ వేవ్..?
ఎందుకంటే.. కేసులు పెరగడాన్నే వేవ్ అని చెబుతున్నారు. అందువల్ల ఇది కరోనా థర్డ్ వేవ్ గా చెబుతున్నాం. ఈ థర్డ్ వేవ్‌లో కేసులైతే రోజుకు లక్షల్లో ఉంటాయి.. ఒక దశలో గరిష్టంగా 14లక్షల వరకూ కేసులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ థర్డ్ వేవ్‌లో సెకండ్ వేవ్ తరహాలో ఆసుపత్రులకు వెళ్ళడాలు, అంబులెన్సుల హడావిడి కనబడవు.. అంతే కాదు.. లక్షణాలు కనిపించినా.. టెస్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. చేసుకోకపోయినా పెద్దగా నష్టం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు వచ్చే కరోనా కేసుల్లో రెండు మూడు రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి . అయితే.. ఓమిక్రాన్ వేవ్ చాలా ఉధృతంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే.. కేసుల సంఖ్య బట్టి ఉధృతం అన్నమాట. అంతే తప్ప ఇదేమీ డేంజర్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒమిక్రాన్ అనేది కరోనా యొక్క శాంత స్వరూపం అన్నమాట.. ఒమిక్రాన్ అనేది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వాక్సిన్ అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఒమిక్రాన్ ప్రాణాలు తీయదు.
అంతే కాదు.. ఒమిక్రాన్ రావడం వల్ల యాంటీబాడీలు, టి సెల్స్ రక్షణ వస్తాయి. అందుకే ఒమిక్రాన్ ఉధృతిని కరోనా వేవ్ కు చివరి దశగా చెబుతున్నారు. ఈ ఒమిక్రాన్ వేవ్ ఫిబ్రవరి కల్లా ముగియవచ్చని చెబుతున్నారు. అంటే మార్చ్ నుంచి లాక్ డౌన్లు, కట్టడి వంటివి ఉండే అవకాశాలు చాలా తక్కువ. అంటే 2020లో మొదలైన కరోనాకు ఇప్పుడు ఇది ముగింపు దశగా అనుకోవచ్చు. కరోనా పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు మారుతుందన్నమాట. అలాగని కరోనా మనల్ని విడిచిపోదు. కరోనా మనతోనే ఉంటుంది.. కానీ హాని చేయకుండా అన్నమాట.