వనమా కేసు: 'ఆస్తి కోసం' బంధాన్ని మరిచారు... దురాగతం కదా?

VAMSI
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలంగాణ లోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన పాల్వంచ ఘటన. ఒక్కో సారి మనము ఏమి అనుకున్నా జరగవు. కొన్ని శాలురు మనకు తెలియకుండానే అనుకోనివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది. తనకు ఏ మాత్రం సంబంధం లేని కుటుంబ గొడవల్లో సంబంధం లేని వ్యక్తి కలుగ చేసుకుని కుటుంబం అంతా నాశనం అవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతను మరెవరో కాదు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు.
ఇప్పుడు ఈ పేరు అంటే తెలియని వారు ఉండరేమో... ఇతని గురించి ఎవరిని అడిగినా అరాచకమే అంటున్నారు. అయితే చనిపోయిన రామకృష్ణను అడిగిన కోరిక మూలంగానే అనుమానం పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యను రాఘవ వద్దకు పంపాలని కోరడంతో తాను ఒక సెల్ఫీ వీడియో చేసి పంపాడు. దానితో అతని బాగోతం అందరికీ తెలిసింది. చనిపోయిన కొడుకు పట్ల ఒక తల్లి మరియు తన సొంత అక్క కూడా చెడుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆస్తి కోసం సొంత కొడుకు గురించి తల్లి మరియు తమ్ముడి గురించి అక్క చెడుగా చెబుతుండడంతో మానవత్వం ఎక్కడుంది అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
దీనికి కారణం రామకృష్ణ అక్క మాధవికి మరియు వనమా రాఘవేంద్రరావు కి మధ్యన ఎంతో కాలంగా ఉన్న అక్రమ సంబంధంమే కారణం. అందుకే రాఘవ నుండి సహాయం పొందడానికి రామకృష్ణదే తప్పు అన్నట్లు తల్లి అక్కలు చెబుతున్నారు. ప్రస్తుతం వనమా రాఘవ అరెస్ట్ చేయబడ్డాడు. ఈ కేసు విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వివాదం సృష్టిస్తోంది. ఇతను తెరాస ఎమ్మెల్యే కావడంతో ప్రతి పక్షాలు ఇదే అవకాశంగా భావించి విమర్శలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: