ఏపీ ఉద్యోగులకు జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అ«ధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది... మీ అందరి సమక్షంలో సీఎస్‌గారికి మళ్లీ చెప్తున్నానని వెల్లడించారు. ఈహెచ్ఎస్ – ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం... 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చాను. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వస్తుందని చెప్పారు.
సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు – రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను – రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు సిఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చానని ప్రకటన చేశారు.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించానన్నారు. నిన్నమీతో చెప్పిన విధంగా, పీఆర్సీ అమలు చేసేనాటికి పెండింగ్ డీఏలు ఉండకూడదని స్పష్టంగా చెప్పినమీదట, పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించానని వెల్లడించారు. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబరు నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ – ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే జనవరి 1, 2022 నుంచే, అంటే ఈనెల నుంచే పీఆర్సీని అమలు చేసి, దాని ప్రకారం జీతాలు ఈనెలనుంచే ఇవ్వాలని ఆదేశించానన్నారు.