నిపుణుల మాట: ఒమిక్రాన్‌తో అసలైన డేంజర్ ఇదీ.. ?
ఇప్పటికే కరోనా రెండు వేవ్‌లు వచ్చింది.. ఇప్పుడు మూడో వేవ్ వచ్చేసింది. అయితే.. ఒమిక్రాన్ వస్తోందన్న ఆందోళన ఎక్కువగా ప్రభావం చూపుతోందట. మానసికంగా ఆందోళన కలిగించడం వల్ల ఒమిక్రాన్ ఎక్కువ నష్టం చేస్తోందట. ఇప్పటికే రెండు వేవ్ ల వల్ల కలిగిన నష్టాన్ని తలచుకుని జనం ఎక్కువగా ఆందోళన చెందుతున్నారట. అదే ఎక్కువగా నష్టం చేస్తోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఒమిక్రాన్ కు అంత ఆందోళన చెందాల్సిన సీన్ లేదని.. కానీ జనం ఎక్కువగా ఊహించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్‌ను పాత డెల్టా వైరస్ తరహాలో భావించకూడదు.. ఒమిక్రాన్ వేరియంట్ అనేది డెల్టా కంటే విభిన్నమైనది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి అవుతుంది. అలాగే డెల్టా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. దీంతో రోగికి చాలా తీవ్రమైన దగ్గు సమస్య ఉండేది.. కానీ.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ గొంతు, ముక్కులోనే ఎక్కువగా ఉంటోంది.
అందువల్ల ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పొడిదగ్గు మాత్రమే వస్తోంది. గతంలో ఇలా వచ్చిన స్పానిష్ ఫ్లూ వంటివి దశాబ్దాల తర్వాత సాధారణ జబ్లుల్లా మారాయి. ఇప్పుడు కరోనా వైరస్ మాత్రం రెండేళ్లలోనే క్రమంగా దాని తీవ్రతను కోల్పోతోందట. అందుకే ఎక్కువగా ఒమిక్రాన్ గురించి భయం అవసరం లేదని.. అదో సాధారణ జలుబుగా మారే రోజులు త్వరలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.