రామ్మోహన్ బావకు బంపర్ ఆఫర్?
ఇప్పుడు అచ్చెన్న, రామ్మోహన్‌లు చంద్రబాబుకు అండగా ఉంటూ..పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి ఆదిరెడ్డి భవాని కూడా పనిచేస్తున్నారు. భవాని...ఎర్రన్నాయుడు కుమార్తె, రామ్మోహన్ అక్క అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఆమె ఆదిరెడ్డి అప్పారావు కోడలు కూడా. అందుకే 2019 ఎన్నికల్లో భవానికి రాజమండ్రి సిటీ టిక్కెట్ ఇచ్చారు. అలాగే ఆమె భారీ మెజారిటీతో గెలిచారు.
ఇలా ఎర్రన్న ఫ్యామిలీ నుంచి భవాని సైతం పనిచేస్తున్నారు. అయితే భవాని ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్...నియోజకవర్గ బాధ్యతలని చూసుకుంటున్నారు. రాజమండ్రి సిటీలో పార్టీ కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజలకు అండగా ఉండటం కూడా చేస్తున్నారు. పేరుకు భవాని ఎమ్మెల్యేగా ఉన్నా సరే...ఆమె బాధ్యతలన్ని వాసు చూసుకుంటారు. ఇలా సిటీలో పనిచేస్తున్న వాసుకే నెక్స్ట్ సీటు ఇస్తారని తెలుస్తోంది.
ఈ సారి రాజమండ్రి సిటీ నుంచి భవాని పోటీకి దిగరని తెలుస్తోంది. ఆమె ప్లేస్‌లో వాసు పోటీ చేస్తారని రాజమండ్రి టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు, వాసుకు సీటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే టీడీపీ తరుపున సిటీలో పోటీకి దిగడం ఖాయమని తెలుస్తోంది. అటు వైసీపీ తరుపున ఎవరు బరిలో దిగుతారనేది క్లారిటీ లేదు. పైగా సిటీలో వైసీపీ అంత స్ట్రాంగ్‌గా లేదు. కాబట్టి వాసుకు మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే వాసుకు బంపర్ ఆఫర్ దొరికినట్లే.