గంటా కొత్త రాజకీయం.. వియ్యంకుడిని లైన్లో పెడుతున్నాడుగా...!
ఇలా కాపు నేతల సమావేశం జరిగాక గంటా రాజకీయం పూర్తిగా మారింది. ఆయన మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. పార్టీ తరుపున మాట్లాడటం మొదలుపెట్టారు. ఇటీవల మాచర్లలో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేత దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే విశాఖలో మళ్ళీ పార్టీ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ పరిణామాలని బట్టి చూస్తే గంటా టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టంగా తెలుస్తోంది.
పైగా నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు ఉండేలా కూడా బ్యాగ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటు వంగవీటి రాధా ఎలాగో..టీడీపీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. కాపు ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ బలపడేలా పనిచేస్తున్నారు. అటు గంటా కూడా అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మళ్ళీ కాపు నేతలని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో తన వియ్యంకుండు, మాజీ మంత్రి నారాయణని కూడా తిరిగి టీడీపీలో యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి అనిల్ కుమార్ యాదవ్‌పై స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగారు. కానీ ఇప్పుడుప్పుడే టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణని మళ్ళీ పార్టీలోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. మళ్ళీ ఆయన నెల్లూరు సిటీ నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి నారాయణ రీఎంట్రీ ఉంటుందో లేదో.. ?