‘బండి’ని లేపుతున్న ‘కారు’.. ఇంకా స్పీడ్ ‘తగ్గేదేలే’!
నాయకులు తప్పు చేసి జైలుకు వెళుతున్నారా? అనే అంశం కంటే ప్రత్యర్ధులు కావాలని జైలుకు పంపుతున్నారనే విషయం మాత్రం అర్ధం అవుతుంది. అలా ప్రత్యర్ధుల ఎఫెక్ట్‌తో జైలుకు వెళ్ళి జగన్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అలాగే రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్లొచ్చాక ఎంత ఫాలోయింగ్ పెరిగిందో కూడా తెలిసిందే...అసలు ఆయనని పీసీసీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగేలా చేసింది. ఇక ఏపీలో జగన్ ప్రభుత్వం..ఎంతమంది టీడీపీ నేతలని జైలుకు పంపిందో కూడా తెలిసిందే. అలా జైలుకు వెళ్లొచ్చినవారిపై ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. దీంతో ఆ నేతలకు ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుంది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జైలుకు వెళ్లొచ్చాక ఏ స్థాయిలో ఫాలోయింగ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇదంతా అధికార పార్టీలు కావాలనే చేశాయని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జైలు పాలయ్యారు. టీచర్లు, నిరుద్యోగుల కోసం దీక్షకు దిగిన బండిని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనకు బెయిల్ కూడా రాలేదు. 14 రోజులు రిమాండ్‌కు కూడా తరలించారు.
అయితే కేసీఆర్ ప్రభుత్వం కావాలనే బండిని జైల్లో పెట్టిందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక ప్రజల వర్షన్ కూడా కాస్త అలాగే ఉంది. ఇదంతా కక్షపూరిత రాజకీయమని, బండిని కావాలనే జైలుకు పంపారనే కోణంలో ఆలోచిస్తున్నారు. జైలుకు వెళ్ళిన బండికి నెగిటివ్ కంటే పాజిటివ్ పెరిగింది. జైలు నుంచి వచ్చాక ఆయనకు మరింత ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.