ట్రోల్ బాబు ట్రోల్ : ఆచార్యలో ఆ మంత్రిని టార్గెట్ చేశారా? నాకేం తెల్వద్ జస్ట్ ఆస్కింగ్!
నోటికి వచ్చిన విధంగా తిట్టడం..నోట్లో ఉన్నదంతా కక్కేయడం..మనసులో కూడా ఏమీ దాచుకోకుండా ఇతరులపై ద్వేషం వెళ్లగ క్కడం ఇవన్నీ వైసీపీకి మాత్రమే తెలిసిన విద్యలు.ఇతర పార్టీల నాయకులు నేర్చుకోకూడదని భావించే విషయాలు కూడా ఇవే!మొన్నటికి మొన్న మాజీ మంత్రి,సీనియర్ పొలిటీషియన్ అశోక్ గజపతి రాజును నానా మాటలూ అన్నారు.రామతీర్థం వేడుకల్లో ఆయనను బండ బూతులు తిట్టి తరువాత తప్పుకున్నారు. ఆ రోజు రికార్డెడ్ ఎవెడెన్స్ లేకపోవడంతో దేవాదాయ, ధర్మా దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చాకచక్యంగా తప్పుకున్నారు. తరువాత నిన్నటి రోజున విజయవాడలో ఓ కార్పొరేటర్ ను బండ బూతులు తిట్టారు.తన డివిజన్ పరిధిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తనను పిలవకుండా ప్రొటొకాల్ పాటించలేదు ఎందుక ని అడిగితే.. బండ బూతులు తిట్టి, తెలివిగా నగర కార్పొరేషన్ అధికారులతో కేసు ఫైల్ చేయించారు.ఇలాంటివి ఎన్నో చేయగలరు వెల్లంపల్లి. కానీ మనం అవి విని బాధపడో అంతర్మథనపడో తప్పుకోవాలి అంతే!
పిల్ల కాలువ డైలాగ్ ను మరిచిపోకముందే బాలయ్య చెప్పిన స్టైల్ ను మరిచిపోకముందే చిరు తెర ముందు సందడి చేయనుండ డం భలే ఆనందంగా ఉందని అంటున్నారు మెగాభిమానులు.. అంచనా వేయడానికి నువ్వేమయినా పోలవరం డ్యామ్ వా.. పట్టి సీమ తూము వా పిల్ల కాలువ అని బోయపాటి శ్రీను..బాలయ్యతో చెప్పించిన డైలాగ్ అదిరిపోయింది.నేరుగా జగనన్నకు ఇది చేరే విషయమే కానీ ఎందుకనో టీడీపీ కూడా ఈ డైలాగ్ ను పెద్దగా ట్రోల్ చేయలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం ఆచార్యలో కొన్ని పొలిటికల్ డైలాగులు మోడ్రన్ రైటర్ కొరటాల శివ రాశారని, సింగిల్ లైనర్స్ అదిరిపోతాయని అంటున్నాయి చిత్ర వర్గాలు. అదే కనుక నిజమైతే ఏపీ సర్కారు ఇంకెంత ఉడికి పోతుందో మరి!
దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి చుట్టూ కథ తిరుగుతుందని ఆచార్యకు సంబంధించి చిత్ర వర్గాలు చెబుతున్న మాట.అంటే ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేశారా ఏంటి? వద్దండి.. మా మాట వినండి..అసలే ఆయన నానా కష్టాల్లో ఉన్నారు.. ప్లీజండి వదిలేయండి..అసలే ఆయన నానా కబ్జాల్లో ఉన్నారు.. కొరటాల శివ గారూ మాట వినండి..ప్లీజండి సుఖీభవ సుఖీభవ.. అంటున్నారు మెగాభిమానులు.