గుడ్ న్యూస్ : ఇంటర్నెట్ లేకుండా.. ఆన్లైన్ పేమెంట్స్?

praveen
భారత్ను డిజిటల్ భారత్ గా మార్చడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా బ్యాంకులకు వెళ్లి జరిపేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కూర్చున్న చోటు నుంచే ఎంతో హాయిగా సులభంగా క్షణాల వ్యవధిలో లావాదేవీలు జరుపుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా ఒకరి అకౌంట్ నుంచి మరొకరి అకౌంట్ లోకి ఎంతో సులభంగా డబ్బులు పంపించు కునేందుకు వెసులుబాటు ప్రస్తుతం అందరూ కలిగి ఉన్నారు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో డిజిటల్ పేమెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అందరు.



 ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకొని డిజిటల్ పేమెంట్ చేస్తూ ఎంతో సౌకర్యవంతమైన నాణ్యమైన సేవలు కూడా పొందుతున్నారు. అయితే ప్రస్తుతం  ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ లు ప్రకటిస్తూ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి ఎన్నో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు వరకు డిజిటల్ పేమెంట్ చేయాలి అంటే తప్పనిసరిగా ఇంటర్నెట్  ఉండాల్సిందే. ఇంటర్నెట్ సదుపాయం లేకుండా డిజిటల్ పేమెంట్ చేయడం కుదిరేది కాదు.


 ఈ విషయంలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.  ఇంటర్నెట్ లేని డిజిటల్ చెల్లింపులు వెంటనే అమల్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఒక లావాదేవీకి 200 రూపాయలకు మించకుండా.. లావాదేవీల మొత్తం కలిపి 2000 రూపాయల వరకు ఉండే విధంగా ఇంటర్నెట్ లేకుండా డిజిటల్ విధానంలో  చెల్లింపులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కార్డులు, వాలెట్ లు, మొబైల్లో లావాదేవీలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: