కవల పిల్లలు.. కానీ సంవత్సరం తేడా.. ఎలాగంటే?
కానీ ఇక్కడ కవల పిల్లలు మాత్రం ఒకరు ఒక సంవత్సరంలో మరొకరు ఇంకో సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. అదెలా అంటారా సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ నిమిషాల వ్యవధిలోనే వేరువేరు సంవత్సరాలలో జన్మించారు. దీంతో అందరి కవలల లాగానే ఇక్కడ ఇద్దరు చిన్నారుల మధ్య కేవలం కొన్ని నిమిషాల తేడా ఉన్నప్పటికీ ఆ నిమిషాల తేడా కాస్త వేగంగా రెండు సంవత్సరాల తేడా గా మారిపోయింది ఈ ఘటన కాలిఫోర్నియాలో వెలుగులోకి వచ్చింది . కాలిఫోర్నియాలో రెండు వేరువేరు సంవత్సరాల్లో కవలలు జన్మించడం ఆసక్తికరంగా మారిపోయింది.
ఓ మహిళ డిసెంబర్ 31వ తేదీన డెలివరీ డేట్ ఉండడంతో ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఇక అర్ధరాత్రి సమయంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో డిసెంబర్ 31 వ తేదీన 11:45 గంటలకు మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సరిగ్గా పదిహేను నిమిషాల వ్యవధిలో మరో బిడ్డకు కూడా జన్మనిచ్చింది సదరు మహిళ 12: 01 గంటలకు మరో బిడ్డ జన్మనివ్వడం తో ఇక కేవలం నిమిషాల వ్యవధిలో పుట్టినప్పటికి కవలపిల్లలు వేరువేరు సంవత్సరాలలో పుట్టినట్లుగా మారిపోయింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.