మహిళ : ఆత్మగౌరవం.. ఆన్‌లైన్‌లో వేలం..!
ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. దీనిపై ముంబయి పోలీసులు కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు. ఈ వ్యవహారంపై తాజాగా ప్రజలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్దెత్తున విమర్శలొచ్చాయి. కేంద్రం కూడా అప్రమత్తమైనది. ఆ యాప్‌నకు హోస్టింగ్ సేవలందిస్తున్న గిట్‌హబ్ సంస్థ బ్లాక్ చేసిందని, కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పోలీసులు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సంయుక్త దర్యాప్తు చేపట్టాయి. అయితే మరోవైపు దర్యాప్తును వేగవంతం చేయాలని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేశాశర్మ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసారు. ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలని సూచించారు.
ఇలాంటివే గత ఏడాది జులైలో కూడా కొంత మంది ముస్లిం మహిళల చిత్రాలను వేలానికి పెట్టడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయాప్ ఓపెన్ సోర్స్ హోస్టింగ్ వేదిక అయిన గిట్‌హబ్ కావడం విశేషం. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో కేసులు నమోదు అవ్వంతో ఆయాప్‌ను ఆన్‌లైన్ నుండి తొలగించారు. అదే తరహాలో ఇప్పుడు బుల్లీ బయ్ యాప్‌లో ముస్లిం మహిళల ఫొటోలను వేలానికి ఉంచడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వంటి నాయకుడు మండిపడ్డారు. మహిళలను అవమానించే ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలి అంటే మనమందరం ఒక్కటై పోరాడాలని ట్వీట్ చేసారు గాంధీ.