సీక్రెట్‌ ఔట్‌: రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదం కారణం ఇదే..!

Chakravarthi Kalyan
డిసెంబర్‌ 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 13 మంది సైనికులు  దుర్మరణం పాలయ్యారు. వాతావరణం సరిగ్గా లేకనే ఈ ప్రమాదం జరిగిందని మొదట్లో అంతా భావించారు. అయితే.. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చన్న వాదనలు కూడా వచ్చాయి. చైనా లేదా పాకిస్తాన్ వంటి దేశాలు ఈ కుట్రకు పాల్పడి ఉండొచ్చని కొందరు అంచనా వేసారు.


బిపిన్ రావత్ భారత సైన్యంలోనే అత్యున్నత పదవిలో ఉండటంతో ఈ అనునాలకు ఆస్కారం ఏర్పడింది. దీంతో ఈ ప్రమాదంపై  కేంద్రం విచారణకు ఆదేశించింది. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. దీన్ని సైన్యం పరిభాషలో కోర్టు ఆఫ్‌ ఎంక్వయిరీ అంటారు. విచారణ పూర్తి చేసిన ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ కమిటీ ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. దీన్ని త్వరలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరికి అందించనున్నారు.


ప్రస్తుతం ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ కమిటీ రూపొందించిన ఈ నివేదికను వైమానిక దళం న్యాయ విభాగం పరిశీలిస్తోంది. ఆ తర్వాత దీన్ని ఎయిర్‌ చీఫ్ మార్షల్‌కు పంపుతారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ హెలికాప్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని తెలుస్తోంది. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులో ప్రయాణిస్తున్న సమయంలోకూనూర్‌కి అనుకోకుండా ప్రతికూల వాతావరణంలోకి వెళ్లిందని నివేదికలో పేర్కొన్నారట.


ఈ ఇది ప్రమాదమే తప్ప.. ఇందులో ఎలాంటి సాంకేతిక లోపం కానీ.. యాంత్రిక తప్పిదం కానీ లేదని.. నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నివేదికలోని అంశాలపై ప్రభుత్వం గానీ.. వైమానిక దళం గానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారికంగా నివేదిక బయటకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: