డ్రంక్ అండ్ డ్రైవ్ : న్యూఇయర్ రోజు ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా..?
మరోవైపు కేబీఆర్ పార్కు సమీపంలో ఓ యువతి నూతన సంవత్సరం రోజు హల్‌చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా ఓ యువతి హంగామానే సృష్టించినది. పోలీసులతో పాటు తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతూ అర్థరాత్రి రెచ్చిపోయినది. ఆ యువతిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులతో మందుబాబులు వాగ్వివాదానికి దిగారు.పోలీస్ వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన కూడా తెలిపారు. రాజేంద్రనగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ బారీగానే మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం సేవించి 92 మంది వాహనదారులు పోలీసులకు చిక్కారు. పోలీసులు ఆ 92 మందిపై కేసు నమోదు చేసారు. ఇటు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో దాదాపు 40 కేసులు నమోదు కావడం విశేషం.
ఇదిలా ఉండగా.. ఆంక్షల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరిగిన పోలీసులు పబ్ లెస్ విషయంలో కచ్చితైన రూల్స్ పాటించారు. జనవాసాల మధ్య ఉన్న పబ్‌ల విషయంలో మరింత కచ్చితంగా ఉన్నారు. గొడవలు, న్యూసెన్స్‌లు లాంటివి జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు పబ్ లదే అని చెప్పినా జనవాసాల మధ్య ఉన్న పబ్‌ల తీరు మాత్రం మారనే లేదు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో టీఓటీ పబ్ ముందు 1గంటల తరువాత కూడా మందుబాబులు హంగామా సృష్టించారు. తాగి రోడ్ల మీద యువతి, యువకులు నానా బీభత్సమే చేసారు అక్కడక్కడ. కొంత మంది రోడ్ల పైనే మూత్ర విసర్జన చేయడం.. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తించిన అమ్మాయిల దృశ్యాలు అక్కడక్కడ కనిపించినట్టు సమాచారం.