తలొగ్గేది లేదు.. యుద్దానికి సిద్దమే?

praveen
గత కొంతకాలం నుంచి రష్యా వ్యవహరిస్తున్న తీరు ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. రష్య పొరుగున ఉన్న చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ఆధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా రష్యా ఎన్నో కుట్రలు కూడా చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే  ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఏకంగా లక్షా 90 వేల మంది సైనికులను మోహరించి యుద్ధ విన్యాసాలు కూడా చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఉక్రెయిన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అగ్రరాజ్యమైన అమెరికా రష్యా ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ రష్యా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అని చెప్పాలి.



 ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ పై ఆధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో అటు చిన్ని దేశం అయినప్పటికి ఉక్రెయిన్ మాత్రం రష్యా చెప్పుచేతుల్లో ఉండడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే తమ దేశం జోలికి వస్తే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ వరుసగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో ఒక వేళ రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేయాల్సి వస్తే పూర్తిస్థాయి ఆర్థిక ఆయుధ సహకారం అందించేందుకు అమెరికా కూడా సిద్ధమైపోతుంది. ఇలాంటి సమయంలో ఇటీవలే ఉక్రెయిన్ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.


 మా స్వతంత్రాన్ని తీసుకెళ్లి రష్యా చేతిలో పెట్టలేము అంటూ ఇటీవలే ఉక్రెయిన్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా స్వతంత్రంగా మేము ఎవరితో ఉండాలి అనేది మేమే నిర్ణయించుకుంటాము అని తెలిపింది. ఎవరికివారు స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తర్వాత రష్యాకు తమ దేశంపై ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు. అలా కాకుండా మళ్లీ తమ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటే ఇక్కడున్న ప్రజలు ఎవరూ కూడా రష్యా చెప్పుచేతుల్లో కి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. రష్యా దగ్గర ఎక్కువగా ఆయుధాలు ఉండొచ్చు. అలాగని రష్యాతో కలవడానికి మేము సిద్ధంగా లేము. ప్రాణాలకు తెగించి అయినా సరే పోరాడుతాం. మా వద్ద లక్ష మంది సైనికులు ఉన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయం అంటూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: