వాట్సాప్ లో మూడో బ్లూటిక్.. దేనికోసం తెలుసా?

praveen
ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలి అంటే కేవలం ఉత్తరాల ద్వారా మాత్రమే పంపేవారు. ప్రస్తుతం టెక్నాలజీలో మార్పులు రావడంతో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి సందేశాలను పంపుతూ ఉండడం గమనార్హం. అయితే ఇలా మెసేజ్ కోసం ఎన్నో ఆన్లైన్ మెసేజింగ్ యాప్  అందుబాటులో ఉన్నాయి  కానీ అందరినీ ఆకర్షిస్తూ  ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ మాత్రం వాట్సాప్ అనే చెప్పాలి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వాట్సప్ ద్వారా పది రకాల సందేశాలు పంపుకునేందుకు వీలుగా ఉండటంతో ఎక్కువ మంది వాట్సాప్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.


 అదే సమయంలో అటు వాట్సాప్ కూడా తమ వినియోగదారుల సంఖ్య పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. వాట్సాప్ తీసుకువచ్చే ఫీచర్లు వినియోగదారులు అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయ్. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో మరిన్ని సరికొత్త ఫీచర్లను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది వాట్సప్. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాట్సాప్ తీసుకు రాబోయే ఒక కొత్త ఫీచర్ కు సంబంధించిన టాపిక్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది . త్వరలో వాట్సాప్ లో మూడు బ్లూ టిక్స్ ఆప్షన్ అందుబాటులోకి రాబోతోంది అన్నది తెలుస్తుంది. ఇప్పటివరకు రెండు బ్లూ టిక్స్ గురించి అందరికీ తెలుసు. మరి మూడవ బ్లూటూత్ దేనికోసం అన్నది మాత్రం ప్రస్తుతం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది.


 ఇక మూడవ బ్లూ టిక్ గురించి కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. సాధారణంగా ఎవరికైనా సందేశాలు పంపినప్పుడు సింగిల్ గ్రే టిక్ వస్తుంది. అవతలివాళ్లు చూసిన సమయంలో 2 బ్లూ టిక్స్ వస్తాయి. ఇంత వరకు మాత్రమే అందరికీ తెలుసు. మరి మూడు బ్లూ టిక్స్ ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారు కదా. మనం పంపిన మెసేజ్ని అవతలి వ్యక్తులు స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఇక మూడవ బ్లు టిక్ పడుతుందట. తద్వారా మనం పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్ తీసారా  లేదా అన్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది అని వైరల్ అవుతున్న కథనంలోని సారాంశం. అయితే దీనిపై ఇటీవలే అధికారిక వాట్సాప్ బ్లాగ్ స్పందిస్తూ ఇలాంటి ఆప్షన్ తీసుకు రావట్లేదు అంటూ క్లారిటి ఇచ్చింది. అంతేకాకుండా ఇలాంటి ఫీచర్ల కోసం తాము ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: