జగన్పై వైసీపీ నేతల్లో సరికొత్త చర్చ...!
ఈ క్రమంలోనే ఆయన మహాకూటమికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక, జనసేన, ఇతర పార్టీ లు.. బీజేపీ కూడా జగన్పై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మ కంగా మారనున్నాయి. అయితే.. వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది చర్చగా మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు వైసీపీ పథకాలు.. ప్రజాదరణ.. సీఎం జగన్ ఫేస్ వాల్యూ.. వంటి అంశాలను నమ్ముకున్న విషయం తెలిసిందే. అయితే.. వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉన్నందున.,. ఈ అంశాలు కలిసిరాకపోతే.. ఏం టి పరిస్థితి..? అనేది వైసీపీ నేతల మధ్య చర్చ.
దీనికి కూడా కారణం ఉంది. గతంలో చంద్రబాబు ఇమేజ్ పనికిరాలేదు.. ఆయన పెట్టిన పథకాలు కూడా పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. దీనిని పరిగణనలోకి తీసు కున్న జగన్.. మూడు రాజధానులు అనే సూత్రాన్ని తీసుకువచ్చారు. అయితే.. ఇది ఇప్పట్లో ముడిపడే వ్యవహారం కానందున.. ఆయన ప్రతి ప్రాంతానికి వ్యూహాత్మకంగా .. కొన్ని ప్రాజెక్టులు కేటాయించి.. వాటిని డెవలప్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు.
ఈ వ్యూహంతోపాటు.. పొరుగు రాష్ట్రం నుంచి ఎలానూ విభేదాలు లేవుకనుక.. సామాజిక వర్గం పరంగా కూడా జగన్కు సంపూర్ణ సహకారం అందడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. దీనిపైనే వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఈ పరిణామం.. వైసీపీని ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కిస్తుందని నాయకులు అంచనా వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.