2023 ఎన్నికలకు "జనసేన" గమ్యం ఎటువైపు?
అయితే మరో వైపు ప్రతి పక్ష టీడీపీ సైతం ఎలాగైనా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని సకల ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ఒక విషయం చర్చకు వస్తోంది. ఇంతకు ముందు 2014 మరియయు 2019 లో జరిగిన ఎన్నికలలో ఒకసారి బీజేపీతో ఇంకోసారి జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీ ఎన్నికలకు వెళ్లనుంది అనే విషయం అందరిలోనూ చర్చగా మారింది. ఇందుకు సంబంధించి జనసేన టీడీపీకి ట్విస్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇంతకు ముందు వరకు జనసేన చెప్పిన ప్రకారం టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని మార్పులు జరిగిన విషయం తెలిసిందే. పైగా బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ నే చూపిస్తోంది. ఇప్పుడు జనసేన టీడీపీ తో కలిసి ఎన్నికలు వెళుతుందా? లేదా స్థానిక ఎన్నికలో కొన్ని చోట్ల బీజేపీతో కలిసి పోటీ చేసిన విధంగా చేస్తుందా? లేదా ఇంటరిగానే తన బలాన్ని నిరూపించుకునే సాహసం చేస్తుందా? అన్న పలు కీలక విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.