'ఒమిక్రాన్' సోకినా మంచిదేనట... అదెలాగో తెలుసా?

VAMSI
ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ చుక్కలు చూపించింది. అయితే రెండు సంవత్సరాల తర్వాత తగ్గిందనుకునే లోపు డెల్టా వైరస్ అంటూ యువతపై ప్రభావం చూపుతూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి వేలాది ప్రాణాలను బలిగొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందరో పిల్లలు తమ తల్లితండ్రులను కోల్పోయి దిక్కులేని వారయ్యారు. ఇవన్నీ మరిచిపోక ముందే మరో వేరియంట్ అంటూ ఒమిక్రాన్ వచ్చిపడింది. ఇప్పటికే రెండేళ్ల నుండి కరోనాతో పోరాడుతున్న మనకు ఈ వైరస్ ఎఫెక్ట్ తెలిసిందే.. అందుకే ప్రజలంతా ఈ కొత్త వేరియంట్ ను చూసి ఇదేమి కొత్త తంటాలు తెస్తుందో, ఎవరి ప్రాణాలు తీస్తుందో అంటూ భయపడుతున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనసుకు ఊరట కలిగించింది కాస్త దైర్యాన్ని నింపే వార్త ఒకటి వినపడుతోంది. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం డెల్టా వైరస్ కు చెక్ పెట్టే బలాన్ని మనకు ఒమిక్రాన్ వైరస్ ఇస్తుందని తెలిసింది. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతిని అడ్డుకునేలా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని ఈ అధ్యయనం ప్రకారం దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వేరియంట్ అయిన డెల్టా తీవ్రతను పెంచకుండా అరికట్టడం కోసం వ్యాది నిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు.  

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు చెందినటువంటు ఖదీజా ఖాన్ ,అలెక్స్ సిగల్ ఆధ్వర్యంలో ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ వివరాలను  వెల్లడించారు. ప్రధానంగా చూస్తే ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చిన బాధితుల్లో డెల్టాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వేగంగా పెరుగుతున్నట్లు వీరు గుర్తించారు. వీరి అంచనాల ప్రకారం ఒమిక్రాన్‌ మన రోగనిరోధక శక్తిని మరింత దృఢంగా చేసి భవిష్యత్తులో వైరస్ లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయగలదు అని చెబుతున్నారు. ఒక రకంగా ఒమిక్రాన్‌ వచ్చినవారికి ఇలా ఒక పాజిటివ్ న్యూస్ ఉందని తెలుస్తోంది...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: