గుంటూరులో ఆ ‘మూడు’ సైకిల్ లాగేసేలా ఉందిగా!
అయితే ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో టీడీపీకి బాగా పట్టు పెరిగినట్లే కనిపిస్తోంది. పైగా ఎస్సీ స్థానాల్లోనే ఎమ్మెల్యేలే ఎక్కువగా ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. అలా ఎక్కువ ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో మొదట నుంచి ఎమ్మెల్యే వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచే సీన్ మారిపోయింది. పైగా ఎమ్మెల్యే పనితీరు కూడా అంతంత మాత్రమే. ఏదో అసెంబ్లీలో జగన్‌కు భజన చేస్తూ తప్ప..నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పికప్ అయ్యారు.
అటు వేమూరులో వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పరిస్తితి కూడా అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల్లో నాగార్జున కూడా ముందు ఉన్నారు. ఇక ఇక్కడ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పుంజుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వేమూరులో సత్తా చాటేలా ఉన్నారు. ఇక హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడులో కూడా టీడీపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఎలాగో ప్రత్తిపాడు టీడీపీ కంచుకోట. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ కూడా సత్తా చాటేలా ఉంది.