వారెవ్వా.. మోదీ అదుర్స్.. చైనా తయారీ ఇండియాలో?

praveen
ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది డ్రాగన్ దేశం చైనా. భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ ఎదురు దాడి చేయటంతో చైనా ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్త  పరిస్థితుల నేపధ్యంలో భారత్తో వ్యూహాత్మక గానే అడుగులు వేస్తోంది. ఓవైపు సరిహద్దులో చైనా సైనికులు అడ్డుకోవడమే కాదు మరోవైపు ఆర్థిక యుద్ధం కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్ చైనా కు సంబంధించిన యాప్స్ అన్నింటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


 ఇలా పూర్తిగా చైనాపై భారత్ లో నిషేధం విధించడం దిశగా పిలుపునిచ్చింది. అయితే కేవలం పిలుపునివ్వడంతో సరిపెట్టుకోకుండా ఆ దిశగా ఎంతో వేగంగా అడుగులు వేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒకప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులను కూడా ఇండియా లో భాగంగా భారత తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ భారత్లో ఏకంగా ఆయుధాల తయారీ కూడా మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు మరో ఘనత సాధించింది మోడీ ప్రభుత్వం.



 ఒకప్పుడు హెచ్.పీ కంప్యూటర్ లకు సంబంధించి చైనాలోని అన్నీ తయారయ్యేవి. కానీ ఇటీవలే మేకిన్ ఇండియా నినాదం లో భాగంగా హెచ్పి కంప్యూటర్లను భారత్లో తయారు చేసి తొలి బ్యాచ్ విడుదల చేశారు. లాప్టాప్ దగ్గరి నుంచి వివిధ గాడ్జెట్స్ వరకు కూడా హెచ్పి కంపెనీ అమ్ముతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చైనా దిగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలో మేకిన్ ఇండియా లో భాగంగా చెన్నైలో హెచ్పికి సంబంధించిన మొదటి బ్యాచ్ ఉత్పత్తి అయి ఇటీవలే విడుదల అయ్యింది. ఇక ఈ ఒక్కటి మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదంతో ఎంత దృఢమైన  సంకల్పంతో ముందుకు సాగుతుంది అని అర్థమవుతోంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: