ఒమిక్రాన్: రెండు డోసులు తీసుకున్నా డోంట్ కేర్?

VAMSI
ఒమిక్రాన్ వేరియంట్ గత కొద్ది రోజులుగా మానవులను కలవరపెడుతున్న మరో వైరస్. ఇప్పటికే ప్రపంచ దేశాలకు పాకిన ఈ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా రూపాంతరం చెంది ఇలా ఒమిక్రాన్ వేరియంట్ గా వచ్చినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా కరోనా కోసం నానా తిప్పలు పడి ఏళ్ల తరబడి శ్రమించి ఎన్నో పరిశోధనలు అనంతరం కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనుగొనగా...ఇపుడు రక్షణ కవచం లాంటి ఆ వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను పూర్తిగా అరికట్టలేదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇప్పటికీ దీనిపై సరైన మందు లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కొన్ని పరిశోధనల అనంతరం ఈ విషయంపై ఒక అంచనాకు వచ్చిన శాస్త్రవేత్తలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఈ కొత్త వేరియంట్ సోకుతుందని వారిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఇక ఈ కొత్త వైరస్  డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలు ద్వారా అర్థమయ్యింది అని నిపుణులు అంటున్నారు. ఇక ఈ కొత్త వేరియంట్ కు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టీకా సామర్థ్యాలను అధిగమించి ప్రభావం చూపే సామర్థ్యం ఉండే అవకాశం ఉన్నదని వివరించారు. దాంతో రెండు డోసుల  వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం ఒమిక్రాన్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

తాజాగా.. ఒమిక్రాన్ ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఇలా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మన దేశంలో ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ బారిన పడ్డ 183 కేసులపై చేసిన అధ్యయనం ద్వారా కేంద్రం వివరాలను వెల్లడించింది. ఈ వివరాలు ప్రకారం ప్రకారం, ఒమిక్రాన్ బారిన పడ్డ ప్రతి పది మందిలో తొమ్మిది మంది రెండు డోసుల టీకాలు వేసుకున్నవారే కావడం గమనార్హం.  కాబట్టి ఒమిక్రాన్ ను ఎదుర్కోవాలి అంటే వ్యాక్సిన్ తో పాటుగా నిబంధనలకు పాటించడం కూడా ముఖ్యమే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: