బాబు...ఆ సీట్లు కూడా ఫిక్స్ చేయాలి?

M N Amaleswara rao
బలహీనంగా ఉన్న చోట బలపడి సక్సెస్ అవ్వాలనే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి దెబ్బకు చాలా చోట్ల టీడీపీ వీక్ అయిపోయింది. నేతలు కూడా వీక్ అయిపోయారు. అటు వైసీపీ ఏమో ఓ రేంజ్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. అసలు వైసీపీకి ఇంకా టీడీపీ చెక్ పెట్టే స్థాయి లేదనే పరిస్తితి ఉంది. కానీ ఆ పరిస్తితి నుంచి బయటపడటానికి చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో నేతలని స్ట్రాంగ్ చేస్తూ వస్తున్నారు. అలాగే పలు చోట్ల మార్పులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా కొత్త కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. టోటల్‌గా అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ చేసి బాబు ముందుకెళుతున్నారు. అయితే ఇక్కడ బాబు మరో అంశంపై కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీ సీట్లలో కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత బాబుది.

అసెంబ్లీ సీట్లు అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయి. కానీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఎంపీ సీట్లు చాలా ముఖ్యం. అలాగే అసెంబ్లీ సీట్లలో గెలుపోటములని ఎంపీ సీట్లలో అభ్యర్ధులు ప్రభావితం చేయగలరు. వారిని బట్టి అసెంబ్లీ సీట్లలో గెలుపు కూడా దక్కుతుంది. అందుకే ఎంపీ సీట్లు కూడా ముఖ్యం. కానీ చంద్రబాబు ప్రస్తుతానికి ఎంపీ సీట్లపై పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు.

ప్రస్తుతానికి టీడీపీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వైసీపీ ఎంపీల్లో కొంతమందిపై వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఎన్నికల్లో వారికి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటి చోట్ల చంద్రబాబు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటినుంచే కాస్త ఫోకస్ పెడితే...ఎంపీ సీట్లలో టీడీపీకి గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం చాలా స్థానాల్లో టీడీపీకి లీడర్లు కావాలి..కాబట్టి వాటిల్లో నాయకులని పెట్టాల్సిన అవసరం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: