ఆనందయ్యకు షాక్.. ఆ మందుకి అనుమతి లేదన్న ఆయుష్..
ఆనందయ్య మందు సంగతేంటి..?
ఆనందయ్య మాత్రం తాను మొదటినుంచీ తయారు చేస్తున్న కరోనా మందుపై పూర్తి ధీమాతో ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో కూడా తన మందు బాగా పనిచేస్తుందని 48గంటల్లోనే దాన్ని నివారించగలమని చెబుతున్నారు. కరోనాకే కాదు, ఇతరత్రా వ్యాధ్యులకి సైతం ఆయన మొదటినుంచీ ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనాతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.
ఆయుష్ ఏం చెబుతోంది..?
గతంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందమయ్య మందు పంపిణీకోసం కోర్టు అనుమతి ఇచ్చింది. అప్పట్లో ప్రభుత్వం తరపున ఉచితంగా పంపిణీ చేస్తారని అనుకున్నా.. అది సాధ్యపడలేదు. ఎక్కడికక్కడ నాయకులు ఆనందయ్య మందుని తయారు చేయించుకుని తమ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో దాదాపుగా ఏపీలో మూల మూలకీ ఆనందయ్య ఆయుర్వేద మందు వెళ్లింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ దాని సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ.. ఆనందయ్య మందు మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆయుష్ విభాగం అనుమతిస్తే మందు అధికారికంగా పంపిణీ చేస్తారు.