'ఒమిక్రాన్' నుండి బయటపడాలంటే అదొక్కటే మార్గం... ?

VAMSI
ప్రజలను భయపెడుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి వేగవంతం అయ్యింది. కరోనా కంటే ఇది చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతూ ప్రజల్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఒమిక్రాన్ తన ఉనికిని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా ప్రజలంతా అప్రమత్తంగా అవ్వాల్సిన  సమయం. ప్రమాదం స్థాయి పెరగక ముందే అందరూ అలెర్ట్ అయ్యి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉంటూ నిబంధనలను పాటిస్తే ఆది లోనే అరికట్టవచ్చు అని ప్రభుత్వం అప్రమత్తం అయింది. అందుకే ముందుగా ఎయిర్పోర్ట్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దేశం లోకి ఎంటర్ అయ్యే వారికి నెగెటివ్ రిపోర్ట్స్ ఉంటేనే అనుమతిస్తున్నారు.

ఒకవేళ అలా కరోనా వచ్చిన వారిని కూడా క్వారంటైన్ అంటూ ముందు జాగ్రత్తలు చేస్తున్నారు. అయితే మరో వైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం అధికారులకు సవాలుగా మారింది. ఇటు ప్రజలు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువయ్యే కొద్ది ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయడానికి ఒక్కో ఒక్కో వ్యూహాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే దేశంలో ఒమిక్రాన్ కేసులు 40 కి దాటగా నైట్ కర్ఫ్యూ విధించే విధంగా ప్రణాళిక రచిస్థున్నట్లు తెలుస్తోంది.

అయితే అది కేవలం ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో ఆ రాష్ట్రాలలోనేనా లేక అన్ని రాష్ట్రాలలోనా అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 కి చేరినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ సదరు ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా పెట్టే అవకాశం  ఉందని  అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మన జాగ్రత్తలో మనము ఉంటే ఈ ఒమిక్రాన్ బారి నుండి బయట పడవచ్చు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే దీని నుండి బయట పడే మార్గం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: