ఓమిక్రాన్ కేసులు.. తెలంగాణాలో అక్కడ లాక్ డౌన్?

praveen
ఇప్పటికే రెండు దశల కరోనా వైరస్ లతో అటు భారత్ అల్లాడి పోయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండవ దశ వెలుగులోకి వచ్చిన సమయంలో ఒక భారత్లో విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలపై ఆశలు కూడా వదిలేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల రోదనలు దేశవ్యాప్తంగా వినిపించాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం  నుంచి కోలుకుంటుంది భారత్. ఇలాంటి సమయంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయం ప్రస్తుతం భారత ప్రజలందరిని మరోసారి భయపెడుతుంది.


 సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పాకి పోతుంది. అయితే డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు మరింత ప్రమాదకారి అనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో భారత్ కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువస్తుంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.. అయినప్పటికీ అటు భారత్లో మాత్రం ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పై అందరికీ పూర్తి స్థాయి అవగాహన వచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఓమిక్రాన్ కేసులు వస్తే ప్రభుత్వం కఠిన నిబంధనల అమలు చేయక పోయినప్పటికీ స్థానిక పాలక వర్గం మాత్రం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తూ ఉండటం గమనార్హం.


 ఇటీవల తెలంగాణ లోకి కూడా చేరుకుంది ఓమిక్రాన్ వేరియంట్.  కొత్త కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒక వ్యక్తికి ఓమిక్రాన్ వైరస్ సోకింది. ఇక అతని భార్య తల్లికి కూడా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్కడి స్థానిక పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది  గ్రామంలో లాక్ డౌన్ విధించినట్లు  తెలిపింది. అయితే ఇప్పటికే గూడెం గ్రామంలో షాపులు హోటళ్లు బడులను మూసివేశారు ఇక రానున్న పది రోజుల పాటు గ్రామంలో కి ఎవరూ రాకూడదు అని ఎవరు బయటికి పోకూడదు అని నిబంధన  పెట్టారు. ఓమిక్రాన్ కేసు వెలుగులోకి రావడంతో అందరూ భయపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: