48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

praveen
ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను భయపెడుతుంది.. దీంతో మొన్నటి వరకూ అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేసిన  దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి. కొన్ని దేశాలు లాక్ డౌన్ లోకి కూడా వెళ్ళి పోతున్నాయి  ఇక భారత్లో కూడా ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండటం భయాందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కృష్ణపట్నం ఆనందయ్య గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక ఆయుర్వేద మందు తయారుచేసి నేనున్నాను అంటూ అందరికీ భరోసా ఇచ్చాడు కృష్ణపట్నం ఆనందయ్య.


 ఎక్కడ డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా  కరోనా వైరస్ మందు పంపిణీ చేసి ఎంతో మందిలో ధైర్యం కల్పించాడు అనే చెప్పాలి. ఇక ఆనందమే తయారు చేసిన ఆయుర్వేదిక్ మందు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అంటూ ఎంతో మంది ఆనందం వ్యక్తం చేశారు. ఏకంగా చావుబతుకుల్లో ఉన్న వారిని సైతం ఆనందయ్య మందు బ్రతికిస్తుంది అంటూ చెప్పారు. ఇప్పుడు ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఆనందయ్య మళ్లీ మందు తయారు చేస్తారా అన్నదానిపై కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మరోసారి తెర మీదికి వచ్చి నేను ఓమిక్రాన్ వైరస్ కు మందు తయారు చేసాను అంటూ ఆనందయ్య ప్రకటించడం తో అందరిలో  కాస్త ధైర్యం తీసుకు వస్తుంది అని చెప్పాలి.


 తాను కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ కి  కూడా  మందు తయారు చేసినట్టు ఆయుర్వేద వైద్యుడు కృష్ణపట్నం ఆనందయ్య చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వైరస్ బారిన పడిన రోగులు తనను సంప్రదిస్తే స్వయంగా వచ్చి వైద్యం అందిస్తాను అంటూ తెలిపారు. కేవలం 48 గంటల్లోనే ఓమిక్రాన్ వైరస్ను నయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు వారి బంధువులు మందు కావాలని సంప్రదించిన కూడా ఔషధాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తాను అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు. దీంతో ఎంతో మంది జనం ఆనందయ్య మందు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: