అద్భుత ఆయుధానికి అంతా సిద్ధం.. భారత్ మరో ముందడుగు?
ఇలా ఆయిల్ తయారీలో వినూత్నమైన ఆవిష్కరణలతో అగ్రరాజ్యాలకు సైతం షాక్ ఇస్తోంది అనీ చెప్పాలి. ఒకప్పుడు ఆయుధాల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వతహాగా ఆయుధాలు తయారు చేసుకుంటూ ఔరా అనిపిస్తుంది. ఇకపోతే ఇటీవలే మరో అద్భుత ఆయుధ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది భారత ప్రభుత్వం. 2022 ప్రారంభంలో బిష్ణు అనే ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించబోతుంది భారత ప్రభుత్వం. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా హైపర్ సోనిక్ మిస్సైల్ తయారీని ప్రారంభించబోతున్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ టెక్నాలజీకి సంబంధించి 2020 లో ఒక సఫలీకృమైన ప్రయోగం జరిగింది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే 2022 ప్రారంభంలో దీనికి కొనసాగింపుగా మరో ప్రయోగం చేసేందుకు భారత రక్షణ శాఖ సిద్ధమైంది అని తెలుస్తోంది. ఇక మొదటి దశలో భూమి నుంచి భూమి మీదికి.. 3500 కిలోమీటర్ల రేంజ్ తో తయారుచేయబడిన అటువంటి హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగ నిర్వహిస్తారు. అయితే భారత్ హైపర్ సోనిక్ మిస్సైల్ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో తయారు చేయబోతుంది అని తెలుస్తోంది. 2022 లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 2023లో పూర్తిచేసి 2024 వరకు అన్ని రకాల ప్రయోగాలు నిర్వహించి భారత సైన్యానికి అందించడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రయోగం సఫలీకృతం అయితే భారత ఆర్మీ మరింత పటిష్టవంతంగా మారిపోతుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.