పీకే సర్వే: తమ్ముళ్ళ హడావిడి..టీడీపీని ముంచుతున్నారా..?
మళ్ళీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ...ఈ సారి గెలిచిన ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. ఇలా పార్టీలు పైచేయి సాధించడానికి చూస్తుంటాయి. ఇప్పటికే రెండు పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ...ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ముందుకెళుతున్న విషయం గురించి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి పీకే టీం ఏ విధంగా పనిచేసిందో కూడా తెలిసిందే.
ఇప్పుడు కూడా ఆ టీం జగన్ కోసం పనిచేస్తుంది...మళ్ళీ అధికారంలోకి రావడానికి కష్టపడుతుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్తితి ఎలా ఉంది? సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు ఏం అనుకుంటున్నారు? అని పలు రకాలుగా సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో పీకే టీం ఒక సర్వేని బయటపెట్టిందని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీకి 120-130 సీట్లు వస్తాయని, వైసీపీకి 40-50 సీట్లు వస్తాయని, జనసేనకు ఓ ఐదు సీట్లు వరకు వస్తాయని పీకే టీం సర్వేలో తేలిందని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. అసలు పీకే టీం ఇంకా పూర్తి స్థాయిలో ఏపీలో పనిచేయడం మొదలుపెట్టలేదు..ఒకవేళ సర్వే చేసిన...ఆ సర్వే వివరాలు అంత ఈజీగా బయటకు రావు...కానీ తమ్ముళ్ళు మాత్రం పీకీ సర్వే అంటూ హడావిడి చేసేస్తున్నారు. ఇలా సర్వేలని నమ్ముకుని తిరుగులేదు అనుకుంటే..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీకే బొక్క పడుతుంది. ఆ విషయం తమ్ముళ్ళకు అర్ధం కావడం లేదు.