జగన్‌కు మరోసారి వాళ్లే ప్లస్ అవుతారా?
అయితే ఇదంతా ప్రతిపక్షాలు చెప్పే మాటలు..మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే అది ఇప్పుడే క్లారిటీగా తెలిసే అవకాశం లేదని చెప్పాలి. కాకపోతే గత ఎన్నికల్లో పరిస్తితి మాత్రం ఇప్పుడు లేదనే చెప్పాలి. అప్పుడు రాష్ట్రం మొత్తం వైసీపీ వైపే ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కొన్ని వర్గాలు జగన్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారు. దీని బట్టి చూస్తే జగన్‌పై కాస్త నెగిటివ్ పెరిగిందనే చెప్పాలి. అలా అని జగన్ ఆధిక్యం పూర్తిగా తగ్గలేదనే చెప్పాలి.
గతంతో పోలిస్తే కాస్త మెజారిటీ తగ్గొచ్చు గానీ..లీడ్‌లో మాత్రం జగనే ఉన్నారు. అంటే చంద్రబాబు కంటే జగన్ ముందున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పటికీ జగన్‌కు లీడ్ ఉండటానికి కారణం...సంక్షేమ పథకాలు.
ఆ పథకాల లబ్దిదారులే..రాష్ట్రంలో ఉండే పరిస్తితులని ఏ మాత్రం పట్టించుకోకుండా...మాకు జగన్ డబ్బులు ఇస్తున్నారు...నెక్స్ట్ కూడా ఆయనకే ఓటు వేస్తామని చెబుతున్నారు. అంటే రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా వారు...జగన్‌కు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. డబ్బులు ఇస్తున్నారు...కాబట్టి జగన్‌కే మా సపోర్ట్ అంటున్నారు...ఇంకా రెండో ఆలోచన లేదని చెప్పాలి. ఇక వారే జగన్‌కు ప్లస్ అవుతారని చెప్పొచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ముంచాలన్న, లేపాలన్న వారే.