తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే...అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంది. ఎలాగైనా నెక్స్ట్ తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. అయితే నెక్స్ట్ బీజేపీ గెలిచి అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరముంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు....అలాగే బలమైన నాయకత్వం లేదు. అలాంటప్పుడు మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టం.
కాబట్టి బీజీపీ ఇంకా కష్టపడాల్సిన అవసరముంది...అయితే ఇదే సమయంలో బీజేపీలో బడా నేతలు అసెంబ్లీ స్థానాల బరిలో దిగాల్సి ఉంది. ముఖ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసెంబ్లీ స్థానాల బరిలో దిగాలి. ఎందుకంటే వీరు బీజేపీలో గెలుపు గుర్రాలు. ప్రస్తుతం వీరు ఎంపీలుగా ఉన్నారు. ఒకవేళ మళ్ళీ ఎంపీలుగా పోటీ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఏదో కేంద్రం వరకు బెనిఫిట్ అవుతుంది.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్ వేవ్‌లో ఇద్దరు నేతలు ఓడిపోయారు. మొదట నుంచి అంబర్‌పేటలో సత్తా చాటుతూ వస్తున్న కిషన్ రెడ్డి...2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటు కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బండి సంజయ్ ఓడిపోయారు.
ఇలా అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన బండి, కిషన్ రెడ్డిలు..2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. కిషన్ రెడ్డి..సికింద్రాబాద్ ఎంపీగా, బండి..కరీంనగర్ ఎంపీగా బరిలో దిగారు. ఇద్దరు మోడీ వేవ్‌లో గెలిచేశారు. అలాగే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది. ఇలా ఎంపీలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు...మళ్ళీ అసెంబ్లీ స్థానాల బరిలో దిగాలి. ఈ ఇద్దరు నేతలు కూడా మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కిషన్ రెడ్డి...అంబర్‌పేట స్థానంలో, బండి...కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడం ఖాయమనే తెలుస్తోంది. అంటే పార్లమెంట్ నుంచి అసెంబ్లీ రూట్‌లోకి వెళ్లనున్నారు.