ఎలక్షన్స్ కోసం.. బ్రహ్మోస్.. ప్లాన్ అదిరింది?
ఈ క్రమం లోనే సాధ్యమైనన్ని వ్యూహాలను అతడు ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమం లోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం గా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారు అన్నది తెలుస్తుంది. ఒకవైపు విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో యూపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. మరోవైపు ఏకంగా ఆయుదాల తయారీ కంపెనీలను యూపీలో స్థాపించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
కాగా ఇప్పటివరకు యూపీలో పలు ఆయుధ తయారీ యూనిట్లను కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సంవత్సరానికి 100 క్షిపణులను ఉత్పత్తి చేసే అటువంటి బ్రహ్మోస్ మిసైల్స్ యూనిట్ యూపీలో ప్రారంభించబోతున్నారు. మొత్తంగా 80 ఎకరాల భూమిలో ఈ యూనిట్ ప్రారంభం కాబోతుంది. ఇక లక్నోలో ప్రారంభించబోతున్న ఈ యూనిట్ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి లభించపోతుంది. ఇలా ఎలక్షన్లో ముంగిట ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించి ఇక యూపీఏ ప్రభుత్వంపై మంచి భావన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మోడీ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ఇక వచ్చే ఎలక్షన్లలో తేలిపోతుంది.