సిబిఐ నే ఒక ఆట ఆడుకుంటోన్న మహిళ ఎవరు ?
ఆమె ఏం చేసినా సంచలనమే... ప్రసార మాధ్యమాలకు వార్తే.. గతంలో ఆమె తన కూతురు హత్యకు గురుకాలేదని ఆమెరికాకు వెళ్లి పోయిందని సాక్షాత్తు సిబిఐకు చెప్పారు. ఆ తరువాత కూతురి హత్య కేసులో నిందితురాలయ్యారు. ప్రస్తుతం తన కుమార్తె బతికే ఉందని, కాశ్మీర్ లో ఉందని పేర్కోంటూ సిబిఐకి లేఖ రాశారు. వెతికి పెట్టాల ని కూడా విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఎవర మహిళా ? ఆమె ఎందికిలా సిబిఐతో ఆటలాడుకుంటున్నారు ?
ఇది 2012లో యావత్ భారత దేశాన్ని కుదిపేసిన ఘటన. ఆ ఏడాది ఏప్రిల్ నాలుగవ తేదీ షీనా బోరా అనే యువతి హత్యకు గురయ్యారు ఈ కేసులో ప్రధాన నిందితురాలు తల్లే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు ను సి.బి.ఐ విచారణ చేసింది. షీనా కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ తో పాటు, ఆమె సహజీవనం చేస్తున్న పీటర్ ముఖర్జీ, కారు డ్రైవర్ శామ్ సుందర్ రాయ్ లను సిబిఐ అరెస్టు చేసింది. హత్యకు గురైన షీనా ను ఆమె తల్లి, ఇతరులు కిడ్నాప్ చేశారని, ఆ తరువాత హతమార్చారని వీరిపై సిబిఐ అఫిడవిటా దాఖలు చేసింది. నాటి నుంచి షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ జైలు జీవితం గడుపుతున్నారు.
విచారణ సమయంలో ఇంద్రాణి ముఖర్జీ సిబిఐ అధికారులు ముప్పతిప్పలు పెట్టారు. విచారణకు అసలు సహకరించలేదు. పైగా చాలా మార్లు సిబిఐని తప్పుదోవ పట్టించారు. హత్యను కప్పిపుచ్చేందుకు చాలా చాలాపనులు చేశారు ఇంద్రాణి ముఖర్జీ. తన కుమార్తే అమెరికాకు వెళ్లిందని సిబిఐ అధికారులకు తెలిపారు. తన కూతురు క్షేమంగా ఉందని, మీరు కావాలంటే వెళ్లి పలకరించడంది అంటూ తప్పుడు అడ్రస్ లు ఇచ్చారు. ఆమె ను విచారణ చేసిన సిబిఐ అధికారులు ఈ కేసును ఎట్లయినా శోధించాలని పట్టుపట్టి విచారణను ముమ్మరం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించ లేదు. ఇదే సమయంలో వేరే కేసులో ఆమె డ్రైవర్ శ్యామ్ సుందర్ రాయ్ అరెస్టు అయ్యారు. ఆ కేసు విచారణ సమయంలో డ్రైవర్ విస్తు పోయే నిజాలు చెప్పాడు. దీంతో సిబిఐ అధికారులు ఆదిశగా విచారణ చేశారు. ఇంద్రాణీ ముఖర్జీ మాజీ భర్త కుమారుడితో షీనా అక్రమ సంబంధం కొనసాగించేదని తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రాణి ముఖర్జీ తన కుమార్తే షీనాను నిలదీసింది. దీంతో తల్లీ కూతుళ్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇక లాభం లేదనుకున్న ఇంద్రాణి ముఖర్జీ తాను సహజీవనం చేస్తున్న పీటర్ ముఖర్జీ, కారు డ్రైవర్ తో కలసి షీనాను హతమార్చారు. ఈ సమాచారాన్ని కారు డ్రైవర్ నుంచి సేకరించిన అధికారులు ముంబయి సమీపంలో ని అడవిలో షీనా మృతదేహాన్ని గుర్తించారు.
ఇన్నేళ్ల తరువాత ఇంద్రాణి ముఖర్జీ తిరిగి వార్తల్లోకి ఎక్కారు. తన కుమార్తె షీనా బతికే ఉందని, కాశ్మీర్ లో ఉన్నట్లు తనకు సమాాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు సిబిఐకి లేఖ రాశారు. తన కూతుర్ని తన వద్దకు చేర్చాలని కూడా ఇంద్రాణి ముఖర్జీ ఆ లేఖలో అభ్యర్థించారు.