పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారుకు లిక్కర్ నుండి వచ్చే ఆదాయం పెద్దదిక్కుగా మారింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 2014-2015 సంవత్సరంలో లిక్కర్ వచ్చిన ఆదాయం పది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు. 2020 -21 వ సంవత్సరంలో 27281 కోట్లు చేరింది. ఈ ఏడాది ఏకంగా 30 వేల కోట్ల పైన ఆదాయం తీసుకురావాలని ఎక్సైజ్ శాఖకు సర్కార్ టార్గెట్ విధించింది. ఈ సందర్భంలోనే కొత్తగా 404 లిక్కర్ షాపులకు, 159 బార్లకు పర్మిషన్ కూడా ఇచ్చి ఆబ్కారీ శాఖకు పని భారాన్ని పెంచేసింది. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రజాలతో బాగా తాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
పోయిన సంవత్సరం కన్నా ఈ ఏడాది 20 శాతం సేల్స్ పెంచాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సమయంలో రాష్ట్రం మొత్తం దాదాపు వెయ్యి కోట్లు రాబట్టడానికి సర్కారు ప్లాన్ చేసుకుని పెట్టుకుంది. పోయిన ఏడాది కరోనా ఉన్నప్పటికీ ఒక డిసెంబర్ నెలలోనే రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్ అయింది. ఈ సంవత్సరం వైన్స్ లు మరియు బార్ ల సంఖ్య ఎక్కువగా పెరగడంతో పోయిన ఏడాది రికార్డులను బ్రేక్ చేయాలని, సర్కారు ఎక్సైజ్ అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పోయి ప్రతి షాప్ కు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈసారి లిక్కర్ సేల్స్ బాగా పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉండడంతో తమ బ్రాండ్లను పెంచుకునేందుకు చాలా లిక్కర్ కంపెనీలు వారి యొక్క సేల్స్ టీమ్ ను రంగంలోకి దింపారు. వారి జిల్లా కేంద్రాలలో లిక్కర్ వ్యాపారులను కలిసి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. వారి యొక్క బ్రాండ్ల సేల్స్ ను పెంచితే అడిషనల్ మార్జిన్ తో పాటు స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తామని చెబుతున్నారు. కరోణ ప్రభావం తగ్గితే బ్యాంకాక్, సింగపూర్, థాయిలాండ్ ట్రిప్పులకు ఏర్పాటు చేస్తామని ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. అమ్మకాలు బాగానే ఉంటాయని ఆశతో ఓనర్ లు కూడా ఎక్కువ స్థాయిలో స్టాక్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లో చాలా గోడౌన్లు లిక్కర్ తో కళకళలాడుతున్నాయి.