దిమ్మతిరిగే ట్విస్ట్ : రైల్లో బాంబ్ అంటూ ఫోన్.. తీరా చూస్తే?

praveen
మనం సినిమాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము.. రైల్వే అధికారులను టెన్షన్ పెట్టడానికి ఎంతోమంది ఆకతాయిలు  చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా రైలులో బాంబు ఉందని అధికారులకు ఫోన్ చేసి టెన్షన్ పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా అపరిచితుల నుంచి ఫోన్ రాగానే చివరికి అన్ని సామాగ్రిని తీసుకొని బాంబు స్క్వాడ్ బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ రైల్లో ఎక్కడ బాంబు దాగివుందని చెమటోడ్చి మరి కష్టపడుతూ ఉంటారు. కానీ చివరికి అది ఒక ఆకతాయి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.


 ఇక్కడ నిజజీవితంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న కారణానికి ఒక వ్యక్తి రైల్వే అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. రైలులో బాంబు ఉంది అంటూ చెప్పి అందరినీ పరుగులు పెట్టించాడు. రైల్వే అధికారులకు ఫోన్ చేసి రైల్లో బాంబు ఉంది అనీ  సమాచారం అందించడంతో ఇక ఆర్ పి ఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్ తో కలిసి పరుగున రైలు దగ్గరికి చేరుకున్నారు. రైలు మొత్తం వెతికినా ఏమి దొరకలేదు ఇక ఆ తర్వాత ఫోన్ కాల్ పై విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


 ఈ ఘటన న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ లో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ రైలులో క్యాటరింగ్ సిబ్బంది తనతో వ్యవహరించిన తీరు అతనికి నచ్చలేదు. దీంతో ఆగ్రహానికి గురయిన సదరు వ్యక్తి జరిగిన విషయాన్ని సోదరుడికు చెప్పాడు. ఈ క్రమంలోనే ఇక అతని సోదరుడు రైల్లో బాంబ్ ఉంది అంటూ ఆర్పిఎఫ్ అధికారులకు ఫోన్ చేసి బెదిరించాడు. మరికొన్ని గంటల్లో పేలిపోతుంది అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చాడు. దీంతో కంగారుపడి సిబ్బంది వెంటనే మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్ ను పట్టుకుని తనిఖీ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం అది ఒక ఆకతాయి చేసాడు అన్న విషయాన్ని గ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: