వార్నీ.. కోవిషీల్డ్ టీకాతో పెద్దగా ఉపయోగం లేదా..?

frame వార్నీ.. కోవిషీల్డ్ టీకాతో పెద్దగా ఉపయోగం లేదా..?

Chakravarthi Kalyan
ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు సోకకుండా ఉండేందుకు టీకాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కూడా అంత వాస్తవం కాదట. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకకుండా టీకాలు అంతగా రక్షణ కల్పించడం లేదని పలు అధ్యయనాల్లో తెలుస్తోంది. ఉదాహరణకు ప్రపంచంలో పలు దేశాలు వాడుతున్న ఫైజర్‌ టీకా కేవలం ఒమిక్రాన్‌పై 33 శాతమే రక్షణ కల్పిస్తుందట. ఈ మేరకు ఓ అధ్యయనం చెబుతోంది.


ఫైజర్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్‌ సోకకుండా కేవలం 33 శాతం రక్షణ ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే.. ఆసుపత్రిలో చేరకుండా ఫైజర్‌ వ్యాక్సిన్‌ 70 శాతం రక్షణను కల్పిస్తుందని దక్షిణాఫ్రికాలో చేసిన ఓ అధ్యయనం చెబుతోంది. ఒమిక్రాన్‌పై విస్తృతంగా జరిపిన ఈ అధ్యయనంలో ఇలాంటి అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్‌ కంటే భిన్నంగా ఉందని.. ఈ ఒమిక్రాన్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఫైజర్‌ టీకాలు అంత ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదట.


కరోనా బారినపడ్డ 2 లక్షల మందిపై ప్రయోగాలు చేసి ఈ ఫలితాలు రూపొందించారు. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ డిస్కవరీ హెల్త్.. దీనితో పాటు దక్షిణాఫ్రికా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ కలిసి సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ విజృంభణకు ఒమిక్రాన్ వేరియంటే కారణమన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో 90 శాతం కొత్త కేసులకు ఒమిక్రాన్ వేరియంటే కారణమట.  ఈ విషయాన్ని డిస్కవరీ హెల్త్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ర్యాన్ నోచ్  చెబుతున్నారు.


ఈ ఒమిక్రాన్ వ్యాప్తి గురించి ఇప్పటికే అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారిలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫైజర్ వేరియంట్ గురించి వచ్చిన ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదే. ఫైజర్ టీకానే ఇండియాలో సీరం సంస్థ కొవిషీల్డ్ పేరుతో అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఒమిక్రాన్ విషయంలో కొవిషీల్డ్‌తో కూడా పెద్దగా ఉపయోగం లేదన్నమాటే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: