తలనొప్పిగా ఉందని బాబా దగ్గరికి వెళ్తే.. ప్రాణం పోయింది?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను పట్టుకుని వీడటం లేదు. ఇంకామంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని నమ్ముతున్నారు చాలామంది. ఈ క్రమంలోనే ఎంతోమంది బురిడీ బాబాల మాయలోపడి భారీగా డబ్బులు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇటీవలే కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్న మహిళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు అని భావించి చివరికి ఒక బాబా దగ్గరికి వెళ్ళింది.


 వైద్యం పేరుతో సదరు వ్యక్తి ఇక బాధితురాలిని కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది సదరు మహిళ. బెంగళూరుకు చెందిన పార్వతి అనే మహిళ గత రెండు నెలల నుంచి తల నొప్పి సమస్యతో బాధపడుతోంది. ఎన్ని హాస్పిటల్లు తిరిగినా ఎలాంటి సమస్య లేదు అని వైద్యులు చెబుతున్నారు. తప్ప తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో  తల నొప్పి సమస్యకు కారణం గాలి సోకడం వల్లే అని అనుకుంది పార్వతి. తెలిసిన వాళ్ళ సలహాతో హాసన్ జిల్లా చెన్న రాయపట్నం సమీపంలో ఉన్న ఆలయ పూజారి మను గురించి విన్న మహిళ అతని దగ్గరికి వెళ్ళింది.


 తల నొప్పి పూర్తిగా నయం చేస్తాను అంటూ పూజారి చెప్పాడు. ఇక వైద్యం చేస్తున్నాను అంటూ చేతిలో చెరుకుగడ పట్టుకొని మహిళను కొట్టాడు. ఇక ఈ నొప్పి తట్టుకుంటే తలనొప్పి పోతుంది అంటూ చెప్పాడు. శరీరం కాళ్లు తలపై కూడా చెరుకుగడతో చితకబాదాడు. కొన్ని దెబ్బలు కొట్టగానే ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా చివరికి ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పూజారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: