సూప‌ర్ ట్విస్టు : రంగంలోకి రాయ‌ల సీమ మేథావులు.. జ‌గ‌న్ స్క్రీన్ ప్లే !

RATNA KISHORE
సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంల‌లో కొత్త‌గా కొన్ని వాద‌న‌లు వ‌స్తున్నాయి. ఓ విధంగా ఇవ‌న్నీ వైసీపీకి అనుబంధంగా ఉన్న సంస్థ‌లో లేదా సంఘాలో అని కొంద‌రు ప‌సుపు పార్టీ పెద్ద‌లు చెబుతున్నా, యుద్ధం మ‌రో విధంగా ఉంది. ఆన్లైన్ వేదిక‌ల‌పై జ‌గ‌న్ త‌న దైన శైలిలో కొన్ని ప్ర‌క‌ట‌న‌లు త‌న ప్రాంతం వారితో ఇప్పించి అమ‌రావ‌తి రైతులను వారితో దూషించేలా చేస్తున్నారు. భారీ నీటి ప్రాజెక్టు ల నిర్మాణంలో త‌మ  ప్రాంత రైతులది త్యాగం అయితే అమ‌రావ‌తి రైతుల‌ది వ్యాపారం అని మేథావుల ఫోరంతో చెప్పిస్తున్నారు జ‌గ‌న్ అని ఓ ఆరోప‌ణ విప‌క్షం నుంచి వినిపిస్తోంది. వాస్త‌వానికి కొన్ని న‌గ‌రాల‌ను చారిత్ర‌క ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌న్న ప్ర‌తిపాద‌న ఎప్ప‌టి నుంచో ఉంద‌ని, అందులో భాగంగానే క‌ర్నూలు కానీ క‌డ‌ప కానీ ఇత‌ర సీమ ప్రాంతాల‌కు కానీ ప్ర‌గ‌తి అందేలా చేయాల‌న్న‌ది టీడీపీ వ్యూహం అని కోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధికి రాచ‌బాట ద‌క్క‌ద‌ని టీడీపీ అంటోంది. ప్రాంతాల‌ను అభివృద్ధి చేయమంటే రాజ‌ధాని పేరిట నాట‌కాలు న‌డ‌ప‌డం ఒక్క వైసీపీ కే చెల్లింద‌ని ప‌సుపు వ‌ర్గం ఫైర్ అవుతోంది.



గ‌త కొద్దిరోజులుగా అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా కొంద‌రు సీమ వాసులు గొంతుక‌లు వినిపిస్తున్నారు. వారు శ్రీ భాగ్ ఒప్పందాన్ని తెర‌పైకి తెచ్చి 3 రాజ‌ధానుల విష‌యానికి తెలివిగా మ‌ద్ద‌తు ఇస్తున్నారు. పైకి తాము 3 రాజ‌ధానుల‌కు స‌మ్మ‌తం ఇస్తున్నామ‌ని చెప్ప‌క‌పోయినా క‌ర్నూలు రాజ‌ధాని విష‌య‌మై ప‌ట్టుబ‌డుతూ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు తాము మ‌ద్ద‌తు ప‌లుకుతున్నామ‌ని అంటున్నారు. ఓ విధంగా ఇదంతా జ‌గ‌న్ స్క్రీన్ ప్లే నే అని టీడీపీ అంటోంది. ఎందుకంటే అమ‌రావ‌తి నిర్ణ‌యం వెలువ‌రించిన రోజు రాయల సీమ నుంచి కానీ ముఖ్యంగా ఆ ప్రాంతానికే చెందిన విప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్ నుంచి కానీ ఆ రోజు వ్య‌తిరేక‌త లేద‌ని, ఉన్న‌ట్టుండి ఇప్పుడెందుకు ఇలా యూ ట‌ర్న్ తీసుకున్నార‌ని ప్ర‌శ్నిస్తోంది ప‌సుపు పార్టీ.



3 రాజ‌ధానుల నిర్మాణం కానీ వాటి అతీ గ‌తీ కానీ ఇంత‌వ‌ర‌కూ తేల‌క‌పోయినా, ఇప్ప‌టిదాకా కోర్టు త‌ర‌లింపు విష‌య‌మై ఏ విధం అయిన స్ప‌ష్ట‌త ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ అటు కేంద్రం కానీ ఇవ్వ‌క‌పోయినా న్యాయ రాజ‌ధాని పేరిట ఓ వివాదం మాత్రం తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం ఒక‌టి వైసీపీ చేస్తూ, త‌ద్వారా ఆ నాలుగు జిల్లాల‌లో టీడీపీని విల‌న్ ను చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని కొంద‌రు బాబు మ‌ద్ద‌తు దారులు అంటున్నారు. పాద‌యాత్ర‌లో కూడా రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంద‌ని చెప్పి అధికారంలోకి రాగానే నాటి ప‌నులు చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్ల‌కు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించ‌కుండా నాట‌కాలు న‌డుపుతున్న‌ది వైసీపీనే అని అంటోంది ఆ వ‌ర్గం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: