కొత్త సబ్జెక్ట్ ఉంటే చెప్పండి.. సీనియర్ నేత పొలిటికల్ కుస్తీ..!
సార్.. ఏంటీమధ్య మీడియా ముందుకు రావడం మానేశారు.? అంటే.. వెంటనే స్పందిస్తూ.. `నేను ఒకటి మాట్లాడతాను.. మీరు మరోరకంగా ప్రచారం చేసుకుంటారు.. మీరేటింగుల కోసం మేం మీరు చెప్పినప్పుడ ల్లా మాట్లాడాలా?`` అని ఎదురు ప్రశ్నించారు. అయితే.. దీనికి మీడియా మిత్రులు.. మా వల్లే మీ రేటింగ్ పెరిగిందని.. అంటున్నారు. మీరేమో.. మీవల్లే మా రేటింగ్ పెరిగిందని చెబుతున్నారు. ఇలా ఎలా సార్? అని ఎదురు ప్రశ్నించారు. అయితే.. ఆయన ఒక్క నిముషం తమాయించుకుని.. అయినా.. కొత్త సబ్జెక్ట్ ఏముంటాది? అనేశారు.
దీంతో మీడియా మిత్రులు.. అన్ని కొత్తవే కదా.. చాలా విషయాలు ఉన్నాయి. టీడీపీ గౌరవ సభలు నిర్వహి స్తోంది.. వరద సాయం.. కేంద్రం ప్రత్యేక హోదాపై మరోసారి వెనక్కి తగ్గింది..వీటిపై మాట్లాడొచ్చు.. లేదా ఓటీఎస్‌పై మాట్లాడొచ్చుకదా సార్! అనేసరికి.. అవన్నీ.. ఓల్డ్ సబ్జెక్టులమ్మా.. కొత్తదేదైనా ఉంటే.. చెప్పండి.. దానిమీద స్టడీ చేసి.. మాట్లాడతా.. అప్పుడు మీ రేటింగులు పెంచుకోవచ్చు! అని చమత్కరించారు. దీంతో ఒకరిద్దరు మీడియా మిత్రులు వెనుదిరిగి వెళ్లిపోతుంటే.. సదరు మంత్రి వర్యులు వెనక్కి పిలిచి మరోసారి కాఫీ ఆఫర్ చేసి.. సంతృప్తి పరిచారట.
దీంతో ఇప్పుడు ఆ మంత్రి ఎదురు పడినా.. మీడియానే కొత్త విషయం ఏదైనా ఉందా సార్! అని అడుగుతుండడం.. ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. చాలా మంది నాయకులు సబ్జెక్టు ఉన్నా లేకున్నా..మీడియా కనిపిస్తే.. వదిలి పెట్టే పరిస్థితి ఉండదు. కానీ, ఈయన మాత్రం ఇటీవల కాలంలో మీడియాకు దూరంగా ఉండడం గమనార్హం.