ఒమిక్రాన్: వరల్డ్‌కు వర్రీ - ఇండియాకు గుడ్‌న్యూస్?
అయితే.. ఇదే సమయంలో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.. అదేంటంటే.. ఒమిక్రాన్‌తో మిగిలిన దేశాలు కుదేలవుతున్నా ఇండియాకు ఆ ముప్పు వచ్చే అవకాశం లేదట.. ఒమిక్రాన్ కేసులు ఇండియాలో పెరిగినా చెప్పుకోదగ్గ స్థాయిలో అది మనల్ని ఏమీ చేయలేదట. ఈ ఊరట ఒక్క భారత్‌కు మాత్రమే ఉండటం విశేషం. మరి ఎందుకు ఇండియాకు ఆ ప్రత్యేకత అంటే.. ఇండియాలో ఉన్న సీరో పాజిటివిటీ రేటు అందుకు కారణమట. మన ఇండియాలో అధిక స్థాయిలో ఈ సీరోపాజిటివిటీ రేటు ఉండటం వల్ల మనవాళ్లు పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదట.
అసలు ఈ సీరో పాజిటివిటీ రేటు అంటే.. ఏంటి.. ఇది ఇండియాలో ఎందుకు ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా ఉంటే వచ్చే ప్రయోజనాలేంటి అంటారా.. ఈ వివరాల్లోకి వెళ్తే.. ఇండియాలో 70 నుంచి 80 శాతం సీరో పాజిటివిటీ రేటు ఉంది. ప్రజల్లో ఉన్న యాంటీ బాడీస్ ఆధారంగా ఈ పాజిటివిటీ రేటును పరిగణలోకి తీసుకుంటారు. ఇండియాలోని నగరాల్లో 90 శాతానికి పైగా ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నాయట. ఈ విషయాన్ని ఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెబుతున్నారు. ఇండియన్లలో ప్రతిరోధకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒమిక్రాన్ సోకినా భయపడాల్సిందేమీలేదు.. ఒమిక్రాన్ వచ్చినా లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అంతే కాదు.. ఎక్కువశాతం మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చట.