నా ఇష్టం... నన్నెవరు ఆదేశించేది? అంటున్న రంజన్ గగోయ్


 నేను రాజ్యసభకు నామినేట్  అయిన సభ్యుడ్ని.. నన్నెవరూ ప్రశ్నించ లేరు. నా ఇష్టం వచ్చినప్పుడు సభకు హాజరవుతా ? నేను సభలో మాట్లాడాలనుకున్నప్పుడే మాత్రమే అక్కడకి వెళ్తా. నన్నెవరూ ఆదేశించ లేదు. ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధిగా నేను అక్కడకు వెళ్తా తెలిసిందా ? అని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.  జాతీయ మీడయాతో ఆయన చేసిన సంభాషణ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది.
కరోనా మహమ్మారి ఇంకా మనను విడిచి పోలేదు. నేను సామాజిక దూరం పాటిస్తున్నా.. రాజ్య సభకు వెళితే అలా పాటించడం కుదరదు. అందుకే నేను సభకు వెల్లడం లేదు.ఇదే విషయాన్ని నేను రాజ్యసభకు కూడా లేఖ రాసా. సామాజిక దూరం పాటించాలని కూడా ఆ లేఖ లో పేర్కోన్నా. అక్కడ కూర్చోనే కుర్చీలు కూడా సరిగా లేవు. ఇదంతా నేను మీకు చెప్పడం లేదు. ఇప్పటికే నేను లేఖ రాశా అని రంజన్ గగోయ్ తెలిపారు.  ప్రభుత్వ విప్ జారీ చేసింది కదా అని విలేఖరులు ప్రశ్నించగా ఆయన తనదైన రీతిలో మీడియాకు చురకలు వేశారు.
రాజ్య సభ నుంచి కొంత మంది సభ్యులను బరిష్కరించారు కదా? అని విలేఖరులు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. తాను  సమావేశాలకు వెళ్లకుండా, అక్కడ జరిగింది ప్రత్యక్షంగా చూడకుండా తానేమి చెప్పగలనని,  ఇలాంటి ప్రశ్నలు వేయడం ఎంత వరకూ సబబు? అని విలేఖరుల ను ఆయన ప్రశ్నించారు.
సుఫ్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో రంజన్ గగోయ్ కీలకమైన తీర్పులు ఇచ్చారు. అందులో ప్రధానంగాపేర్కోనదగింది బాబ్రీ మసీదు విధ్వంసం కేసు. ఈ కేసు ప్రస్తుతం అధికారం లో ఉన్న భారతీయ జనత పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఆ తీర్పు సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా ఇవ్వడంతో అత్యున్నత న్యాయస్థానం పై విమర్శలు ఎక్కువగా రాలేదు. అయితే ఆ తరువాత  ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ఆయన రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు.  ఇదే విషయాన్ని మీడియు జనం ఆయనను పదే పదే ప్రశ్నించారు కూడా. ఎప్పుడు ఎవరు ఈ ప్రశ్న అడిగినా ఆయన ఖరాఖండీగా సమాధానం చెప్పేవారు. మీడియా జనం పై ఎదురు దాడికి దిగేవారు. ప్రతిపక్ష సభ్యులు మాత్రం రంజన్ గగోయ్ ని అధికార పార్టీ సభ్యుడిగా ఇంతకాలం భావిస్తూ వచ్చారు. తాజాగా ఆయన  నాఇష్టం వచ్చినప్పుడ రాజ్యసభకు వెల్తా.. నన్నెవరు ఆదేశించేది అంటూ పరోక్షంగా తనను నామినేట్ చేసిన భారతీయ జనతా పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: